National Mathematics Day : ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన భారతదేశమంతటా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాము. మ్యాథ్స్ విద్యను ప్రోత్సహించడం, గణితం అంటే భయపడేవారికి మ్యాథ్స్ చాలా సులభమని చెప్తూ.. ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇండియాలో డిసెంబర్ 22వ తేదీనే ఎందుకు గణిత దినోత్సవాన్ని జరుపుతారో.. దాని చరిత్ర, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు చూసేద్దాం.
చరిత్ర..
భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. ప్రతిసంవత్సరం భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుతున్నారు. శ్రీనివాస రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకుని.. డిసెంబర్ 26, 2011న ముద్రాసు విశ్వవిద్యాలయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దీనిని సెలబ్రేట్ చేస్తున్నారు.
ప్రాముఖ్యత
గణిత విద్యను ప్రోత్సహించడం, మ్యాథ్స్‌లో సేవలు అందించిన వారికి ప్రశంసలు అందించడం, మ్యాథ్స్ అంటే భయపడే వారికి.. గణితం ఎంత సులువో చెప్పేందుకు ఈ డేని నిర్వహిస్తున్నారు. యువతను గణితంవైపు ఆసక్తి చూపించేలా ప్రోత్సాహించడమే దీని ప్రధాన లక్ష్యం.
శ్రీనివాస రామానుజన్ గురించిన ఆసక్తికరమైన విషయాలివే..
శ్రీనివాస రామానుజన్ గురించి నేటి తరానికి అంతగా తెలీదు. కానీ.. అతను చేసిన సేవలను గుర్తించి.. జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22వ తేదీన, 1887వ సంవత్సరంలో భారతదేశంలోని తమినళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు. చిన్ననాటి నుంచి మ్యాథ్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన.. నంబర్ థియరీ, ఇన్ఫినిటీ సిరీస్, మోడ్యూలర్ ఫామ్స్, ఫ్రాక్షన్స్పై గణనీయమైన కృషి చేశారు.
పార్టీషియన్ ఫంక్షన్, ప్రైమ్ నెంబర్స్, elliptic integralsపై చేసిన కృషి గణిత శాస్త్రంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. 1918లో రాయల్ సొసైటీ ఫెలోగా రామానుజన్ ఎన్నికయ్యాడు. ఆ సమయంలో గణిత శాస్త్రజ్ఞుడికి దక్కిన అరుదైన గౌరవం ఇది. అందుకే ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవాన్ని ఇండియా జరుపుకుంటుంది.
ఎలా సెలబ్రేట్ చేస్తారంటే..
జాతీయ గణిత దినోత్సవం రోజు.. మ్యాథ్స్‌పై పలు రకాల క్విజ్లు, టెస్ట్‌లు నిర్వహిస్తారు. మంచి ప్రదర్శన చూపిన వారికి గిఫ్ట్‌లు అందిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, పరిశోధన సంస్థలపై ఈ సబ్జెక్ట్ ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో వివరిస్తారు. సెనిమార్లు, క్విజ్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ.. మ్యాథ్స్ ప్రాముఖ్యతను చాటి చెప్తూ ఉంటారు.
Also Read : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
మరిన్ని చూడండి