national testing agency has released common university entrance test cuet pg 2025 Exams schedule check subject wise schedule here | CUET PG Exams: సీయూఈటీ పీజీ

CUET PG 2024 Exam Schedule: దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ – 2025’ పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 43 షిఫ్టుల్లో 157 సబ్జెక్టులకు పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా మొత్తం 4,12,024 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు సంబంధించిని సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను 10 రోజుల ముందునుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

సీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000 / 011 – 69227700 ఫోన్ నెంబర్లలో లేదా ఈమెయిల్ హెల్ప్‌డెస్క్ – cuetpg@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 

సీయూఈటీ పీజీ 2025 పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం:

➥ సీయూఈటీ పీజీ పరీక్షను 90 నిమిషాలపాటు సీబీటీ ఆధారంగా నిర్వహిస్తారు. మొత్తం 75 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సిలబస్ అభ్యర్థి ఎంపిక చేసుకున్న పేపర్ కోడ్ ఆధారంగా మారుతుంటాయి.

➥ సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 10.45 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.15 గంటల వరకు మూడోసెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది.

➥ ఎగ్జామ్ డిగ్రీ సిలబస్ ఆధారితంగా ఉంటుంది. స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయిస్తారు.

➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే చేరుకోవాలి. పరీక్ష ఆరంభానికి అరగంట ముందుగానే అభ్యర్థులు హాల్‌టికెట్ల పరిశీలన, పరీక్ష హాల్, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, వ్యక్తిగత హాజరు తదితర ప్రక్రియను పూర్తిచేస్తారు. పరీక్షకు 10 నిమిషాల ముందు పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలను లాగిన్ అయి చూసుకోవచ్చు.

తెలగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు…

➥ తెలంగాణ: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

➥ ఆంధ్రప్రదేశ్: అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నర్సంపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు…

➥  అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్: మార్చి మొదటివారంలో.

➥ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: పరీక్షకు 3, 4 రోజుల ముందునుంచి.

➥ పరీక్ష తేది: 13.03.2025 – 31.03.2025.

➥ ఆన్సర్ కీ వెల్లడి తేదీ: తర్వాత వెల్లడిస్తారు.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి

Source link