ByGanesh
Tue 11th Jul 2023 11:48 AM
లేడీ సూపర్ స్టార్ నయనతార వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుంది తప్ప తరగడం లేదు. మంచిగా యోగ, వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకునే నయనతార గత ఏడాది జూన్ లో దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి అయ్యింది అనే సంతోషాన్ని ఆస్వాదించకుండానే ఈ జంట పలుమార్లు వివాదాలను ఫేస్ చేసింది. తర్వాత ఇద్దరు కవల పిల్లకి సరోగసి ద్వారా తల్లయిన నయనతార పెళ్ళికి ముందే షారుఖ్ ఖాన్-అట్లీ కలయికలో తెరకెక్కిన జావన్ లో హీరోయిన్ గా మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు.
తాజాగా విడుదలైన జవాన్ ప్రివ్యూ లో నయనతార లుక్స్ చూస్తే సూపర్ హాట్ అనిపించాయి. ఆమె చేతిలో గన్ తో నిజంగా లేడీ సూపర్ స్టార్ అన్న పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆమె లుక్స్ పవర్ ఫుల్ గా ఉంటే.. శారీ లోను కూల్ గా కనిపించింది. మరో హీరోయిన్ దీపికా పదుకొనే గెస్ట్ రోల్ అయినా.. ఆమె ఓ ఫైట్ సీక్వెన్స్ లో కనిపించబోతున్నట్టుగా అట్లీ జవాన్ ట్రైలర్ లోనే కన్ ఫామ్ చేసారు. దీపికా శారీలో కనిపించగా నయనతార మాత్రం ఓ షాట్ లో ప్యాంట్ షర్ట్ తో నడిచొస్తుంటే.. వావ్ నయనతార ఎంత బాగుందో అని అనకమానరు.
నిజంగా నయనతార జవాన్ లో కనిపించిన తీరుతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం నయనతార స్టార్ హీరోల కన్నా ఎక్కువగా యంగ్ హీరోల సినిమాల్లోనే కనిపించడానికి రెడీ అవుతుంది. జవాన్ సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది.
Nayanthara look in Jawan preview:
Jawan trailer: Nayanthara beautiful look viral