ByGanesh
Fri 01st Dec 2023 12:41 PM
ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ సలార్ ట్రైలర్ కోసం వెయిట్ చెయ్యడమే కాదు.. సోషల్ మీడియాలో సలార్ కి సంబందించిన హ్యాష్ టాగ్స్ తో హడావిడి చేస్తున్నారు. రెండు మూడు రోజుల వరకు రణబీర్ కపూర్ యానిమల్ మూవీ సోషల్ మీడియాని ఆక్యుపై చేసినా.. నిన్నటినుంచి సలార్ ట్రైలర్ హ్యాష్ టాగ్ తో ఫాన్స్ యానిమల్ హ్యాష్ టాగ్స్ ని తొక్కేశారు. నిన్న మొత్తం ట్విట్టర్ X లో యానిమల్ పై సలార్ డామినేషన్ కనిపించింది. గత రెండు రోజులుగా సలార్ అప్ డేట్స్ తో మేకర్స్ ట్రైలర్ పై భీబత్సమైన అంచనాలు పెంచుతున్నారు.
సలార్ ట్రైలర్ మ్యానిలో ప్రభాస్ ఫాన్స్ ఉండగా.. ఇప్పుడు వారిలో మరో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నేడు రాబోయే సలార్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫాన్స్ కి ఇప్పుడు యానిమల్ టాక్ షాకిచ్చింది. ఈరోజే విడుదలైన యానిమల్ మూవీ కి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి యునానమస్ గా సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఇప్పుడు #Animal #AnimalReview #RanbirKapoor #AnimalPublicTalk ఇలా సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే ఇవే హ్యాష్ టాగ్స్ కనిపిస్తున్నాయి.
దానితో సలార్ క్రేజ్ మొత్తం యానిమల్ పైకి షిఫ్టవుతుంది. యానిమల్ గురించిన మాటలే కనిపిస్తూన్నాయి, వినిపిస్తున్నాయి. ఎవరు చూసినా యానిమల్ టాక్ గురించిన డిస్కర్షన్ లో కనిపిస్తున్నారు. రణబీర్ కపూర్ యాక్టింగ్ అదుర్స్, సందీప్ రెడ్డి వంగా మేకింగ్ సూపర్బ్ అంటున్నారు. మరి ఈ యానిమల్ మాయలో సలార్ ట్రైలర్ కి ఏ మాత్రం క్రేజ్ వస్తుందో అంచనా వెయ్యడం కష్టం. అందుకే ప్రభాస్ ఫాన్స్ లో ఆ టెన్షన్. చూద్దాం సలార్ ట్రైలర్ యానిమల్ టాక్ ని ఎలా మడతెట్టేస్తుందో అనేది.
New tension in Prabhas fans:
Animal Talk vs Salaar Trailer