No need for security-Saif Ali Khan సెక్యూరిటీ అక్కర్లేదు-సైఫ్ అలీ ఖాన్


Tue 11th Feb 2025 07:06 PM

saif ali khan  సెక్యూరిటీ అక్కర్లేదు-సైఫ్ అలీ ఖాన్


No need for security-Saif Ali Khan సెక్యూరిటీ అక్కర్లేదు-సైఫ్ అలీ ఖాన్

ఈమధ్యన దేవర విలన్ భైర సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగోడు దూరి సైఫ్ పై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ని కత్తితో పొడిచిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ కూడా  చేసారు. 

అప్పటి నుంచి సైఫ్ అలీ ఖాన్ కు భద్రత పెంచారు, టైట్ సెక్యూరిటీ నడుమ సైఫ్ ఫ్యామిలీ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన సెక్యూరిటీ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దాడి జరిగాక సైఫ్ కి సెక్యూరిటీ ఎందుకు లేదు అని అడిగారు. నాకు సెక్యూరిటీపై నమ్మకం  లేదు, ఎప్పుడు సెక్యూరిటీ నడుమ ఉండాలనుకోలేదు. 

ఈ దాడిని కూడా ఓ పీడకలలా భావిస్తున్నాను. దాడి తర్వాత కూడా నాకు ఎలాంటి సెక్యూరిటీ వద్దు, నాకు ఎలాంటి ముప్పు లేదు, ఆ దాడి కూడా పొరపాటున జరిగింది. దొంగ దొంగతనం కోసం వచ్చాడు, అనుకోకుండా దాడి చేసాడు. అంతేకాని ఉద్దేశ్యపూర్వకంగా చేసిన దాడి కాదు. ఈ దాడి నా లైఫ్ ని మార్చదు అంటూ సెక్యూరిటీపై తనకెలాంటి నమ్మకం లేదని తేల్చేసాడు సైఫ్ అలీ ఖాన్. 


No need for security-Saif Ali Khan:

Saif Ali Khan has not requested any security cover





Source link