JEE Main 2025 Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు(JEE Main 2025 Results) ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలో విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ వివరాలు నమోదుచేసి స్కోర్‌కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,58,136 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రాణించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 10వ ర్యాంకులో, తెలంగాణకు చెందిన బాని బ్రత మాజీ 12వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ (మెయిన్) పేపర్-2 (బీఆర్క్/బి ప్లానింగ్) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
కొనసాగున్న జేఈఈ (మెయిన్) సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ..
జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఇఫ్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్షలు రాసినవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏప్రిల్ 1 నుంచి సెషన్-2 పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…
మరిన్ని చూడండి