ByGanesh
Wed 02nd Apr 2025 12:14 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర డివైడ్ టాక్ తోనే కలెక్షన్స్ పరంగా రఫ్ఫాడించింది. ఎన్టీఆర్ స్టామినాని దేవర కలెక్షన్ ప్రూవ్ చేసాయి. ఇపుడు ఈ చిత్రాన్ని జపాన్ లో కూడా రిలీజ్ చేసారు. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్-కొరటాల దగ్గరుండి ప్రమోట్ చేసారు. మార్చి 28 రిలీజ్ అయ్యింది.
ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేసారు. ఎన్టీఆర్ అక్కడ జపాన్ మీడియాలో దేవర 2 పై ఇచ్చిన అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాను దేవర 2 కోసం మాట్లాడుతూ ఇపుడు దేవర 2 చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది, దేవర 1 కన్నా పార్ట్ 2 లో చాలా పెద్ద కథ, పార్ట్ 1 లో దేవర కోసం చాలా నేర్చుకున్నారు.
దేవర 1 లో వర గురించి పెద్దగా రివీల్ అవ్వదు, దేవర పార్ట్ 2లో మాత్రం వర కోసం ఎక్కువ తెలుసుకుంటారు, అంతేకాకుండా అసలు దేవర కి ఏమైంది అనే బ్యాక్ స్టోరీకి సమాధానం దేవర 2 లో దొరుకుతుంది అంటూ ఎన్టీఆర్ దేవర 2పై ఇచ్చిన బిగ్ అప్ డేట్ పై ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
NTR big up on Devara 2:
Jr NTR teases whats in store for Devara 2