NTR in War 2 tension వార్ 2 టెన్షన్ లో ఎన్టీఆర్


Wed 19th Feb 2025 03:23 PM

ntr  వార్ 2 టెన్షన్ లో ఎన్టీఆర్


NTR in War 2 tension వార్ 2 టెన్షన్ లో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెన్షన్ లో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు. కారణం జనవరిలోనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వెళ్లాలనే ఎన్టీఆర్ ప్లాన్ ను ఇప్పుడు మారిపోయింది. వార్ 2 షూటింగ్ ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఎన్టీఆర్ టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డేట్లు సర్దుబాటు అవుతున్నప్పటికీ కీలకమైన నటుల డేట్స్ అందుబాటులో లేకపోవడంతో వార్ 2 షూటింగ్ కొంత జాప్యం అవుతుందని సమాచారం. 

దానితో వార్ 2 షూటింగ్ లో లాక్ అయిన ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి రాలేకపోతున్నారు. ఒకవేళ రెండు సినిమాల షూటింగ్స్ పారలల్ గా చేద్దామంటే ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవ్వాల్సి ఉంటుంది. వార్ 2 లుక్ కి ప్రశాంత్ నీల్ మూవీ లుక్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకే వార్ 2 పూర్తయ్యేవరకు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మొదలు పెట్టలేకపోతున్నారని అంటున్నారు. 

మరి ఎన్టీఆర్ రాక కోసం ప్రశాంత్ నీల్ వెయిటింగ్. మార్చ్ నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ మొదలయ్యే ఛాన్స్ వుంది. మరోపక్క ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా అది తమిళ్ వాళ్ళు వాడేశారు. అందుకే ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ టైటిల్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 


NTR in War 2 tension:

War 2 – Jr NTR Upset Over Delay In Hrithik Roshan Starrer Production





Source link