ByGanesh
Sun 23rd Feb 2025 07:17 PM
ప్రశాంత్ నీల్ తన పంథా మార్చుకోలేదు అని ఎన్టీఆర్ తో చేస్తున్న మూవి ఫస్ట్ షాట్ చూస్తే అర్ధమైపోతుంది. అంటే ప్రశాంత్ నీల్ గత చిత్రాల బ్యాక్ డ్రాప్ లో ఉన్న మసి, బొగ్గు, మట్టి సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ చిత్రంలోనూ ఉండబోతుంది. కేజిఎఫ్ చిత్రంలో బంగారు గనుల కోసం తవ్వకాల్లో మసి కనిపించడమే కాదు, హీరో యష్ మాస్ లుక్ కూడా అదే మాదిరి ఉంటుంది.
ఇక సలార్ లో ప్రభాస్ బొగ్గు గనుల్లో పని చేయడమే కాదు, సలార్ సీజ్ ఫైర్ మొత్తం బొగ్గుతోనే కనిపిస్తుంది. ప్రభాస్ మొహం మీద, పృథ్వీ రాజ్ మొహం మీద కూడా ప్రశాంత్ నీల్ మసి పూశారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న చిత్రం కూడా 1960 బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాలోనూ హీరో ఎన్టీఆర్ కు అలాంటి మసి పూయడం పక్కాగానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ఫస్ట్ షాట్ తోనే ఆ రకమయిన బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ మూవీ ఉంటుంది, ఎన్టీఆర్ కూడా ఆ విధమైన మాస్ లుక్స్ లోనే కనిపించడం ఖాయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అది చూసి ఎన్టీఆర్-నీల్ మూవీ ఏం మారలేదు, ప్రశాంత్ నీల్ తన పంథాలోనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
NTR Neel Movie update:
NTR Neel Movie shooting update