NTR.. then Yash and then Prabhas ఎన్టీఆర్.. తర్వాత యష్ ఆ తర్వాతే ప్రభాస్


Thu 31st Oct 2024 03:47 PM

prashanth neel  ఎన్టీఆర్.. తర్వాత యష్ ఆ తర్వాతే ప్రభాస్


NTR.. then Yash and then Prabhas ఎన్టీఆర్.. తర్వాత యష్ ఆ తర్వాతే ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో లో గత డిసెంబర్ లో విడుదలైన సలార్ పార్ట్ 1 సెన్సేషనల్ మాస్ హిట్ గా నిలివడంతో దానికి సీక్వెల్ గా రాబోయే సలార్2 పై అందరిలో క్రేజ్ మొదలయ్యింది. సౌర్యంగ పర్వ లో ప్రభాస్ యాక్షన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పట్లో సలార్ 2 ఉండకపోవచ్చు అనే టాక్ మొదలైంది 

ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ తో పాటుగా హను రాఘవపూడి ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉండగా ఆ తరవాత కూడా ప్రభాస్ స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ పూర్తి ఫోకస్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే చిత్రం పైనే పెట్టారు. అది నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళాల్సి ఉన్నా ఎన్టీఆర్ మాత్రం జనవరి నుంచే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వెళతారు. 

అయితే ఎన్టీఆర్ తో మూవీ కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ ఇమ్మీడియేట్ గా సలార్2 సెట్స్ లోకి వెళ్లరట. యష్ తో KGF 3 పూర్తి చేశాకే ప్రభాస్ సలార్ 2 చేస్తారని అంటున్నారు. మరోపక్క సలార్ 2ని అలాగే ఎన్టీఆర్ మూవీని ప్రశాంత్ నీల్ పారలల్ గా పూర్తి చేస్తారనే టాక్ కూడా మొదలైంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. 


NTR.. then Yash and then Prabhas:

Prashanth Neel huge lineup





Source link