ByGanesh
Mon 25th Nov 2024 01:20 PM
దుల్కర్ సల్మాన్ – వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా విడుదలై సెన్సేషనల్ హిట్ అవడమే కాదు 100 కోట్ల క్లబ్బులో హుందాగా అడుగుపెట్టింది.
కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లో అతి పెద్ద హిట్ అవడంతో లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలయ్యింది. మరి లక్కీ భాస్కర్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
తాజాగా లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ లాక్ చేసేసారు మేకర్స్. ఈ నెల 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా లక్కీ భాస్కర్ ని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్లుగా పోస్టర్ వేసి ప్రకటించారు. మరో మూడు రోజుల్లో లక్కీ భాస్కర్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.. గెట్ రెడీ ఫ్యాన్స్.. ఓటీటీలో లక్కీ భాస్కర్ ని వీక్షించేయ్యండి.
Official-Lucky Bhaskar OTT Date Fix:
Lucky Bhaskar OTT Date locked