ByGanesh
Mon 21st Apr 2025 09:12 PM
నిర్మాత నాగవంశీ సక్సెస్ ఫుల్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా తెరకెక్కించిన మ్యాడ్ స్క్వేర్ థియేటర్స్ లో మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది. మార్చ్ 28 న మ్యాడ్ స్క్వేర్ విడుదల కాగా జస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెంట్ గా నిలిచిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ ఫన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసింది.
థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా వచ్చేసింది.
ఏప్రిల్ 25 నుంచి మ్యాడ్ స్క్వేర్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఫ్యామిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఏప్రిల్ 25 నుంచి ఓటీటీ లో చూసేందుకు సిద్దమైపొండి.
Official – Mad Square OTT Date Out:
Mad Square OTT Date Fix