Officials were shocked at Subbayya hotel సుబ్బయ్య గారి హోటల్ కి అధికారులు షాక్

కొన్నాళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. కాలం చెల్లిన వస్తువులను ఉపయోగించడం, నాసి రకం వస్తువుల వాడకం, అనుమతి లేని ఫుడ్ కలర్స్ వాడకం, కిచెన్ పరిశుభ్రంగా ఉండడం వంటి విషయాలే కాదు, పాచిపోయి, కుళ్లిపోయిన మటన్, చికెన్, ఫిష్ లతో కస్టమర్స్ కి ఫ్రెష్ గా వడ్డిస్తున్నారంటూ ఆయా రకాల హోటల్స్ కి నోటీసులు జారీ చేస్తున్నారు. 

ఎంత జరిగినా ఏమి జరిగినా జనాలు హోటళ్లకు వెళ్లడం ఆపడం లేదు. వారాంతంలో ఫ్యామిలీస్ తో కలిసి జనాలు హోటళ్లలోనే తింటున్నారు తప్ప ఇంట్లో పొయ్యి వెలిగించడం లేదు. 

ఇక ఇప్పుడు సిటీలోనే కాదు పలు చోట్ల తెగ ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ హోటల్ లో ఫుడ్ కావాలంటే క్యూ లైన్ లో నించోవాలి. అలాంటి హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. 

సుబ్బయ్య గ్రూప్స్‌కు చెందిన మూడు హోటళ్లపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు, నిల్వ పచ్చళ్లు, పొడులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించిన అధికారులు. 

Source link