Oka Brundavanam is coming to steal your hearts this summer వేసవిలో రాబోతున్న ఒక బృందావనం

కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా నూతన తారలు, క్రేజ్‌ ఉన్న తారలు అనే తారతమ్యాలు ఉండవు. ఈ మధ్య కాలంలో కేవలం కంటెంట్‌తోనే సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆ కోవలోకి చేరే చిత్రమే ఒక బృందావనం నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంలో నటించారు! బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుత అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. 

వినోదంతో పాటు మంచి అర్థవంతమైన సందేశాన్ని కూడా ఈ చిత్రంలో జోడించాం. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న మా చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టి మీ ముందుకు ట్రైలర్‌ను తీసుకవస్తాం. తప్పకుండా కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి, ఎడిటర్లు తమ్మిరాజు మరియు సంతోష్ కామిరెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను మెరుగుపరిచారు మరియు సంగీత దర్శకులు సన్నీ మరియు సాకేత్ ఆహ్లాదకరమైన సౌండ్‌ట్రాక్‌ను అందించారు. చంద్రబోస్, రామజోగై శాస్త్రి, శ్యామ్ కాసర్ల, శ్రీనివాస మౌళి మరియు కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యంతో, ఈ పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

Source link