Over 1,000 earthquakes Why this Greek island is shaking since January 27: భూకంపం అంటే వణికించేదే. ఒకసారి భూకంపం వస్తే ఆ ప్రాంతంలో ఉండటం మంచిదా కాదా అని ఆలోచిస్తాం. అలాంటిది ఆ ప్రాంతంలో పది రోజుల్లో వెయ్యి భూకంపాలు వచ్చాయి. గ్రీకు దీవులైన శాంటోరిని , అమోర్గోస్‌లు జనవరి 27 నుండి, నిరంతర భూకంపాలు వణికిపోతున్నాయి. 1,000 కంటే ఎక్కువ భూప్రకంపనలు ఈ పది రోజుల కాలంలో నమోదయ్యాయి. నిరంతర ప్రకంపనల కారణంగా
అక్కడ నివసిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఆ దీవులలో వస్తున్న భూకంపాలలో అత్యధికం 3 నుంచి 4.9 మధ్య తీవ్రతతో ఉంటాయి. వందలాది భూప్రకంపనలు శాంటోరిని ద్వీపంతో పాటు సమీపంలోని అమోర్గోస్ ద్వీపంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రెండు దీవులను అత్యంత పవిత్రమైన దీవులుగా పిలుస్తూ ఉంటారు.
ఎప్పుడు చూసినా వణికిపోతున్నట్లుగా ఉండే వాతావరణంలో ఉండలేక.. తాము ఉన్న ప్రాంతం ఇప్పుడు కూలిపోతుందో అర్థం కాక ఆందోళనతో అక్కడ నివసిస్తున్న వారంతా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ దీవులలో నివసిస్తున్న ప్రజలు పదివేల మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రతీ రోజూ చుట్టుపక్కల సముద్రంలో వందలాది చిన్న భూకంపాలు నమోదవుతున్నాయి. భవనాలు కుదుపుకు గురవతున్నాయి. ద్వీపంలోని కొండలపై ఉన్న దుమ్ము ఈ కుదుపుల కారణంగా గాలి వచ్చినప్పుడు గాల్లోకి లేచినట్లుగా లేస్తోంది. ఈ పరిణామాలతో అతి పెద్ద భూకంపం వస్తే ఆ ప్రాంతం అంతా కుప్పకూలిపోతుందని శిథిలంగా మారుతుందన్న భయంతో చాలా మంది ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
జియోడైనమిక్ ఇన్స్టిట్యూట్ ప్రకారం .. మూడు కంటే తక్కువ 440 భూకంపాలు సంభవించాయి. బుధవారం ప్రకంపనలు తగ్గాయని స్థానికులు , ప్రభుత్వ అధికారులు చెప్పారు కానీ తీవ్రత తగ్గి ఉంటుంది కానీ భూకంపాలు కాదని భావిస్తున్నారు. ఈ భూకంప తీవ్రతల్లో అత్యధికంగా 5.1. భూకంప శాస్త్రవేత్తలు ఈ ప్రకంపనలను స్టర్లలో సంభవించే శ్రేణిగా అభివర్ణించారు. అయితే ఇన్ని ప్రకంపనలుు ఉన్నా భారీ తీవ్రత ఉన్న భూకంపం రాకపోవడం మాత్రం విచిత్రమేనని అంటున్నారు. ఇలాంటి ప్రకంపనలు వరుసగా వస్తూంటే.. పెద్ద భూకంపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఐరోపాలో భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల్లో గ్రీస్ ఒకటి. ఇది ఆఫ్రికన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉంది. ఇక్కడ నిరంతర కదలికల వర్రకూ తరచుగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. భూకంప కేంద్రాలు సముద్రగర్భం క్రింద ఉన్నాయని.. ఎప్పుడైనా సునామీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని పరిశోధకులు చెబుతున్నారు.
భారీ భూకంపం వస్తే సమస్యలు వస్తాయి కాబట్టి గ్రీకు అధికారులు అత్యవసరంగా తీసుకోవాల్సి న చర్యలను తీసుకున్నారు. శాంటోరిని, అనాఫీ, అమోర్గోస్, ఐయోస్‌లలో స్కూళ్లను మూసివేశారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలను పంపించారు కొండచరియలు విరిగిపడే ప్రమాదం కారణంగా ఆయా ప్రాంతాల నుంచి మనుషుల్ని తరలించారు.
Also Read: ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్ – వారానికి 120 గంటలు పని చేయాలట !
మరిన్ని చూడండి