OYO sparks outrage with controversial advertisement BoycottOYO trends on X | OYO: ఓయోను బాయ్‌కాట్ చేయాలని ఊగిపోతున్న నెటిజన్లు

OYO Controversial Advertisement: ప్రముఖ ఆన్ లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సంస్థ  ‘OYO రూమ్స్’ వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఇచ్చిన ప్రకటన ఒకటి మతపరమైన టర్న్ తీసుకుంది. ఒక హిందీ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఓయోను బాయ్ కాట్ చేయాలన్న ట్రెండ్ ప్రారంభణయింది. 

ఓయో విడుదల చేసిన ప్రకటనలో “భగవాన్ హర్ జగహ్ హై” అనే ట్యాగ్‌లైన్‌ ఉంది.   “దేవుడు ప్రతిచోటా ఉన్నాడు “అని దీనర్థం.   దీనికి నేరుగా దిగువన “ఔర్ ఓయో భీ” అని ఉంది. అంటే భగవంతుడు ఎక్కడెక్కడ అయితే ఉన్నాడో.. అక్కడ ఓయో కూడా ఉందన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే ఈ ప్రకటన ద్వారా హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఓయో అంటూ ట్రెండ్ ప్రారంభమయింది.  

ఓయో ప్రకటన కర్తల ఉద్దేశం..అన్ని చోట్లా ఓయో సౌకర్యం ఉన్న హోటల్స్ ఉన్నాయని చెప్పడం. అంటే కుంభమేళాతో పాటు ఇతర పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఓయో హోటళ్లు ఉంటాయని చెప్పదల్చుకున్నారు. కానీ ఓయోకు ఉన్న  బ్యాడ్ ఇమేజ్ వల్ల అలాంటి అర్థం కాకుండా.. మరో అర్థం యువతలోకి వెళ్లింది. దీంతో వారు సీరియస్ గా తీసుకున్నారు.  

సున్నితమైన విషయం కావడంతో ఓయో కూడా స్పందించింది.  తాము రెలిజియస్ టూరిజంను ప్రోత్సహిస్తూ ప్రకటన ఇచ్చామన్నారు. 



 

సోషల్ మీడియా కాలంలో ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా.. చూసుకోవడమే పెను సవాల్‌గా  మారుతోంది. 

 

మరిన్ని చూడండి

Source link