ByGanesh
Wed 05th Jul 2023 06:05 PM
మెగా ఫ్యామిలీలో జూన్ 9 న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అదే నెలలో అంటే జూన్ 20 న మెగాస్టార్ కి మనవరాలి రూపంలో మహాలక్ష్మి పుట్టింది అని మురిసిపోయారు. మహాలక్ష్మి వచ్చిన వేళా విశేషం అన్ని శుభశకునములే అంటూ మెగాస్టార్ చెప్పారు. అయితే ఈనెలలో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త అఫీషియల్ అయ్యింది. మరోపక్క పవన్ కళ్యాణ్ మూడో భార్యకి విడాకులు ఇవ్వబోతున్నాడనే న్యూస్ వెబ్ మీడియాలో తెగ వైరల్ గా మరింది.
మొదటి భార్య నందినితో విడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత రేణు దేశాయ్ ని వివాహమాడి.. ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చి అన్నా లేజ్నోవాని వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఓ బిడ్డకి తండ్రయ్యాడు. అయితే కొన్నాళ్లుగా అన్న లేజ్నోవా మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించడం లేదు. అటు పవన్ తో కూడా కలిసి కనిపించకపోయేసరికి అందరూ పవన్ కి మూడో భార్యతో కూడా విడాకులయ్యాయేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. కొన్ని వెబ్ సైట్స్ లో అదే వార్త ప్రముఖుంగా ప్రచురితమయ్యింది.
అయితే ఇదంతా కావాలనే పవన్ కళ్యాణ్ పై పెయిడ్ బ్యాచ్ ప్రచారం చేస్తుంది, ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతమవడంతో పవన్ కళ్యాణ్ పై ఇలాంటి లేని పోని ఆరోపణలు సృష్టిస్తున్నారంటూ పవన్ ఫాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Paid batch campaign on Pawan?:
Pawan Kalyan and his third wife Anna Lezhnova separated?