Pakistanis no longer need security clearance for Bangladesh visa as bilateral thaw progresses : పాకిస్తాన్ నుంచి ఎవరైనా తమ దేశంలోకి రావాలంటే ముందస్తుగా సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. 2019 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నారు. టెర్రరిస్టు కార్యకలాపాల కోసం పాకిస్తాన్ పౌరులు తమ దేశ భూభాగాన్ని వాడుకుంటున్న కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని తొలగిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక కుట్ర ఉందని.. భారత్ లోకి టెర్రరిస్టుల్ని పంపేందుకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు – ఎలాన్ మస్క్ హెచ్చరిక – ఇది వంద శాతం నిజం !
భారత్ బంగ్లాదేశ్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్ నుంచి గతంలో పాకిస్తాన్ తమ దేశ టెర్రరిస్టుల్ని పంపేది. కానీ తర్వాత బంగ్లాదేశ్ తో భారత్ సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో అలాంటి వాటికి చెక్ పెట్టించేసింది. దాంతో పాకిస్తాన్ టెర్రరిస్టుల చొరబాట్లు బంగ్లా వైపు నుంచి తగ్గిపోయాయి. కశ్మీర్ ద్వారా చేసే ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు సైన్యం అడ్డుకట్ట వేస్తోంది. నిజానికి టెర్రరిస్టులే కాకుండా పలువురు బంగ్లాదేశీయులు కూడా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నారు. వారిని కూడా భారత్ కట్టడి చేస్తోంది.
ఇలాంటి సమయంలో పాకిస్తాన్ పౌరులకు తమ దేశాలకు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లు లేకుండా ఎంట్రీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్ అంగీకరించడం వివాదాస్పదంగా మారుతోంది. భారత్ కు ముప్పు తెచ్చేలా సరిహద్దు భద్రతను బలహీనం చేసేలా బంగ్లాదేశ్ కొత్త పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుున్నాయి. భారత్ ను రెచ్చగొట్టేందుకు యూనస్ ప్రయత్నిస్తున్నారని చైనా, పాకిస్తాన్ తో కలిసి భారత్ పై కుట్రలు చేస్తున్నారన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: విమానంలో ఆ జంట ఆగలేకపోయారు – నింగి నేల మధ్య పని పూర్తి చేశారు – అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో తలదాచుకున్నారు. ఆమె భారత్ నుంచి మళ్లీ తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయంగా ప్రజల మద్దతుతో ప్రధాని అవుతారేమో అన్న భయంతో యూనస్ కుట్రలు చేస్తున్నారు. షేక్ హసీనా పార్టీకి చెందిన వారిని అరెస్టులు చేయించడం, హిందూ మైనార్టీలపై దాడులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దీనికి ఇప్పుడు సరిహద్దు కుట్రలు అదనంగా మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కట్టడి చేయడానికి భారత్ ఏం చేస్తుందో అన్న ఉత్కంఠ ఏర్పడింది.
మరిన్ని చూడండి