parents have the right to claim a share over their children property know the law and the process to claim share

Do Parents Have Right Over Their Children Property: తమకు ఆస్తిని ఇవ్వలేదోనో లేదా న్యాయబద్ధంగా పంచలేదోనో ఆరోపిస్తూ, తల్లిదండ్రులపై కోర్టుకు ఎక్కే సంతానాన్ని మనం తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రులు లేదా పూర్వీకుల ఆస్తిలో తమకు హక్కు ఉందని, దానిని తమకు ఇప్పించాలని కోరుతూ వారి పిల్లలు కేసులు వేస్తుంటారు. అదే విధంగా.. పిల్లల ఆస్తిపైనా తల్లిదండ్రులకు హక్కు ఉండాలిగా!. తల్లిదండ్రులకు నిజంగా అలాంటి హక్కు ఉందా?. దీని గురించి చట్టం ఏం చెబుతోంది?.

చట్ట ప్రకారం…
తల్లిదండ్రులు, తమ పిల్లలు సంపాదించిన ఆస్తిలో వాటా కోరకూడదని భారతీయ చట్టం చెబుతోంది. అయితే, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, తల్లిదండ్రులకు తమ పిల్లల ఆస్తిపై హక్కు లభిస్తుంది, వాళ్లు వాటా కోరవచ్చు. 2005లో, హిందు వారసత్వ చట్టంలో చేసిన సవరణలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, ఏయే పరిస్థితుల్లో, తమ పిల్లల ఆస్తిపై తమ హక్కు పొందవచ్చో చూద్దాం.

మొదటి వారసురాలు.. తల్లి
ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా సంతానం అకాల మరణం చెందితే, వాళ్ల ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు ఉంటుందని చట్టం చెబుతోంది. అంతేకాదు, పుత్రుడు లేదా పుత్రిక వయోజనులు & అవివాహితులు అయి, వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో మరణించినప్పటికీ ఆ ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కు వస్తుంది. అయితే, ఇక్కడ ఓ చిన్న షరతు ఉంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులకు ఆస్తిపై సంపూర్ణ హక్కులు లభించవు. బదులుగా, ఇద్దరికీ ప్రత్యేక హక్కులు ఉంటాయి.

పిల్లల ఆస్తిపై హక్కుల విషయంలో, హిందు వారసత్వ చట్టం తల్లికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే, ప్రాథమిక హక్కు తల్లికే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిని మొదటి వారసురాలిగా పరిగణిస్తారు. తండ్రి రెండో వారసుడు అవుతాడు. తల్లి కూడా లేకపోతే, అప్పుడు మాత్రమే ఆ ఆస్తిపై తండ్రి పూర్తి హక్కులు పొందుతాడు. 

కుమారుడు & కుమార్తె విషయాల్లో ప్రత్యేక చట్టాలు
హిందు వారసత్వ చట్టం ప్రకారం, కొడుకు & కుమార్తె విషయాల్లో ప్రత్యేక క్లాజ్‌లు ఉన్నాయి. కుమారుడు లేదా కుమార్తె అవివాహితులుగా ఉండి, హఠాత్తుగా చనిపోతే, కుమారుడు/ కుమార్తె ఆస్తిపై తల్లికి మొదటి హక్కు ఉంటుంది. తండ్రిని రెండో వారసుడిగా గుర్తిస్తారు. ఇలాంటి సందర్భంలో తల్లి కూడా లేకపోతే.. తండ్రికి, ఇతర వారసులకు ఆ ఆస్తిని పంచుతారు.

వివాహితుడైన కుమారుడు చనిపోతే..
కుమారుడికి వివాహం జరిగిన తర్వాత మరణిస్తే, అతని భార్యకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుంది. 

వివాహితురాలైన కుమార్తె చనిపోతే..
కుమార్తె వివాహం చేసుకున్న తర్వాత ఏదో ఒక కారణంతో చనిపోతే, ఆమె ఆస్తిపై ఆమె పిల్లలకు సహజ హక్కు ఉంటుంది. పిల్లలు లేతపోతే ఆ ఆస్తి మొత్తం భర్తకే దక్కుతుంది. ఈ కేస్‌లో, కుమార్తె ఆస్తిపై హక్కుల విషయంలో తల్లిదండ్రులు చివరి వరుసలో ఉంటారు.

మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించిన 5 బ్యాంకులు – ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ కూడా ఉండొచ్చు! 

మరిన్ని చూడండి

Source link