హిందీ భాషా విషయంలో తమిళనాడు నేతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. హిందీ భాషను మాపై రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. తమిళ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేయకండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.