ByGanesh
Mon 31st Mar 2025 11:38 AM
పవన్ కళ్యాణ్ వలనే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, పవన్ వలనే కూటమి ప్రభుత్వం నడుస్తుంది, పవన్ లేకపోతే టీడీపీ లేదు, చంద్రబాబు పవన్ వల్లే గెలిచారు అంటూ చాలామంది కాదు కాదు జనసైనికులు మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల తర్వాత పవన్ గ్రాఫ్ పెరగడంతో జనసైనికుల తీరు మారింది. పవన్ లేకపోతే కూటమి ప్రభుత్వం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాగబాబు అయితే కష్టపడి గెలిచామంటూ చెప్పుకుంటున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఉగాది రోజున చంద్రబాబు తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు కాబట్టే చంద్రబాబుకు మద్దతుగా నిలిచాను అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 2014 ఎన్నికలకు కొద్దిగా ముందు తాను రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేంత సత్తా తనకు లేదన్న విషయాన్ని ఎన్నికలకు ముందే గ్రహించానని పవన్ కల్యాణ్ చెప్పారు.
అప్పట్లో బలంగా ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి మద్దతు ఇచ్చానని, సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వారికి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు. మరి తన సత్తా ఏమిటో చెప్పకనే చెప్పిన పవన్ కళ్యాణ్ 2014 నుంచి తన మనసులో అదే ఉంది కాబట్టే 2024 వరకు పొత్తులో కొనసాగుతున్నాను.
ఒకవేళ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలవకపోయి ఉంటే ఏపీ పరిస్థితి ఎలా ఉండేదో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సో పవన్ ఎలాంటి గర్వం లేకుండా ఉన్నది చెప్పారు, కాబట్టి జనసైనికులు కూడా కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
Pawan Kalyan comments on alliance with Chandrababu Naidu once again:
Why Supporting CBN – Pawan Kalyan Correct Analysis