ByGanesh
Wed 12th Feb 2025 02:55 PM
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంటర్ అవుతాడా అని పవన్ ఫ్యాన్స్ ఎదురు చూడని రోజు లేదు. పవన్ కళ్యాణ్ వారసుడిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారో అని ఆతృతగా ఉన్నారు అభిమానులు. అకీరా మాత్రం హీరో అవ్వడం కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా మారేందుకు కష్టపడుతున్నాడు. అసలు అకీరా హీరో అవుతాడా లేదంటే మారేదన్నా అనే విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అకీరా మాస్ కటౌట్ చూసినప్పుడల్లా పవన్ ఫ్యాన్స్ లో అదే ఆలోచన. ఇక పవన్ కళ్యాణ్ కొడుకును పొదుపుగా బయటికి తీసుకొస్తున్నారు. గతంలో అంటే గత ఏడాది 2024 ఎన్నికల్లో గెలిచినప్పుడు కొడుకు అకీరాతో కలిసి చంద్రబాబు నాయుడిని, ఢిల్లీలో పెద్దలను కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసినపుడు పబ్లిక్ లోకి తీసుకొచ్చారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు దేవాలయాల సందర్శనార్ధం మూడు రోజుల పాటు తన కొడుకు అకీరా అలాగే ఫ్రెండ్ ఆనంద్ సాయి తో కలిసి వెళ్లారు. కొడుకు అకీరా తో కలిసి పవన్ కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండ్రి పవన్ తో అకీరా ను చూసిన ఫ్యాన్స్ అకీరా మాస్ కొటౌట్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తుందా అని మాట్లాడుకుంటున్నారు.
Pawan Kalyan visits Agastya Maharshi temple with Akira Nandan:
Pawan Kalyan and Akira In Devotion