Pawan Kalyan Wife Anna Lezhneva in New Year Celebrations న్యూ ఇయర్ వేడుకల్లో పవన్ వైఫ్


Sun 31st Dec 2023 08:05 PM

anna lezhneva  న్యూ ఇయర్ వేడుకల్లో పవన్ వైఫ్


Pawan Kalyan Wife Anna Lezhneva in New Year Celebrations న్యూ ఇయర్ వేడుకల్లో పవన్ వైఫ్

పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి.. శ్రీమతి అనా కొణిదెల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయాన్ని సందర్శించారు. అక్కడి అనాథ బాలబాలికలతో ముచ్చటించి కేక్ కట్ చేశారు. వారి చదువుల గురించి తెలుసుకున్నారు. అయిదుగురు బాలికల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉందని తెలుసుకొని ఆ మొత్తాన్ని ఆమె చెల్లించారు. అలాగే ఆ శరణాలయానికి కావలసిన నిత్యావసర సరకులు, బాలలకు అవసరమైన సామాగ్రిని భారీ మొత్తంలో అందించారు.

రీసెంట్‌గా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ని కూడా ఆమె ఇలాగే జరుపుకున్న విషయం తెలిసిందే. క్రిస్మస్‌కి ముందు ఆమె హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అక్కడ ఉన్న చిన్నారుల విద్యాబుద్ధుల గురించి అడిగి తెలుసుకుని, క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా అందచేశారు. మళ్లీ ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని ఆమె అనాథ బాలబాలికలతో జరుపుకుని.. మరోసారి తన ఉన్నత హృదయాన్ని చాటారు. 

అనా కొణిదెల గొప్ప మనసును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఉమెన్ విత్ గోల్డెన్ హార్ట్, లైక్ హస్బెండ్ లైక్ వైఫ్, హ్యాపీ న్యూ ఇయర్ వదినమ్మ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే జగన్‌ని టార్గెట్ చేస్తూ.. వారిద్దరి ఫొటోలను పెట్టి.. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. 


Pawan Kalyan Wife Anna Lezhneva in New Year Celebrations:

Anna Lezhneva Celebrates New Year at Friends Foundation





Source link