Pawan said this on behalf of the fans అభిమానుల తరపున సారి చెప్పిన పవన్


Fri 30th Jun 2023 09:21 PM

pawan kalyan,prabhas fans  అభిమానుల తరపున సారి చెప్పిన పవన్


Pawan said this on behalf of the fans అభిమానుల తరపున సారి చెప్పిన పవన్

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేపట్టారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కొద్దిపాటి రెస్ట్ తోనే మళ్ళీ భీమవరం బహిరంగ సభలో పాల్గొంటున్నారు. వారాహి యాత్రలో ఆయన ఈరోజు వేలాదిమంది నడుమ భీమవరంలో భారీ సభ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఇతర హీరోల అభిమానులని లైన్ లో పెడుతున్నారు. నేను అందరి సినిమాలు చూస్తాను. నాకు ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరు హీరోలు ఇష్టం.. మీరు ఏ హీరోని అభిమానించినా మీ ఓటు మాత్రం నాకు వెయ్యండి, రాజకీయంగా నన్ను సపోర్ట్ చెయ్యండి అంటూ చెబుతూ వస్తున్నారు.

అలాగే ప్రభాస్, మహేష్ బాబు వారిద్దరూ నాకన్నా పెద్ద హీరోలంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా  మారాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గతంలో తన అభిమానులకి-ప్రభాస్ అభిమానులకి జరిగిన ఓ గొడవపై స్పందించారు. భీమవరం సభలో ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో ఒకసారి ప్రభాస్ గారి అభిమానులకు.. నా అభిమానులకు చిన్న పోస్టర్ విషయంలో గొడవ జరిగింది, తప్పు ఎవరిదైనా మా వారి(అభిమానుల) తరపున చేతులెత్తి వేడుకుంటున్నాను అంటూ ఆయన అభిమానుల తరుపున ప్రభాస్ అభిమానులని వేడుకున్నారు.

అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ కొంతమంది ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్ పోస్టర్స్ వేసి ప్లకార్డులతో జనసేనకు మద్దతు ప్రకటించారు. మరి ఇలా ప్రతి హీరో అభిమాని పవన్ కళ్యాణ్ వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయనకి విజయం తధ్యమే. 


Pawan said this on behalf of the fans:

Pawan Kalyan says sorry to Prabhas fans





Source link