Petrol Price Union Minister Hardeep Singh Puri Reply In Lok Sabha On Fuel Price In India

Petrol Price: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.1111.87గా ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో లక్షద్వీప్ ఉందని అక్కడ లీటర్ పెట్రోల్ రూ.99.61కి దొరుకుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశం అంతటా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా అని రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ ప్రశ్న అడిగారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటి వరకు లేదని చెప్పారు. రాష్ట్రాల్లో పన్ను ఆధారంగా ధరలు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే జులై 18వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు వివరాలను కేంద్రం వెల్లడించింది. ఏపీలో రిఫరెన్స్ సిటీగా అమరావతిని పేర్కొంటూ ధరలు సేకరించింది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87గా ఉండగా, డీజిల్ ధర రూ.99.61గా ఉన్నట్లు కేంద్రం వివరించింది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66గా ఉండగా, డీజిల్ ధర రూ.97.82గా ఉన్నట్లు స్పష్టం  చేసింది. 

ఏయే రాష్ట్రంలో ఎంతమేర ధరలు ఉన్నాయో చూద్దాం!

Source link