PM Kisan 19th Installment: Farmers to Receive Funds on February 24 Check Details

PM Kisan :దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan). ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఇప్పటివరకు 18 విడతలు విడుదల కాగా, 19వ విడత కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

19వ విడత విడుదల తేదీ
మీడియా నివేదికల ప్రకారం.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదుపరి విడుదల తేదీ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 24, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లో పర్యటించనున్నారు. ఆయన అక్కడి వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొని పీఎం కిసాన్ యోజన 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు.అలాగే, మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

ఇ-కేవైసీ తప్పనిసరి
ఈ పథకం కింద ప్రయోజనాలను పొందాలంటే రైతులు e-KYC (ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్) ప్రక్రియను తప్పనిసరి పూర్తి  చేయాలి. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 15, 2024న 18వ విడత నిధులను విడుదల చేశారు.

పీఎం కిసాన్ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి?
అర్హత గల రైతులు క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:
* ఆధార్ కార్డు
*  పౌరసత్వ ధృవీకరణ పత్రం
*  భూమి  పత్రాలు
*  బ్యాంక్ ఖాతా వివరాలు
* ఇ-కేవైసీ చేయాలి

PM Kisan కోసం నమోదు చేయాలంటే:
* ఆన్‌లైన్ నమోదు: అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు.
* సామూహిక సేవా కేంద్రం (CSC): గ్రామాల్లోని CSC కేంద్రాల ద్వారా సహాయం పొందవచ్చు.
* రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించి కూడా నమోదు చేసుకోవచ్చు. 
* పట్వారీ లేదా రెవెన్యూ అధికారుల సహాయంతో నమోదు చేయించుకోవడం.

Also Read  : Meeting of Telangana Congress MLAs: స్థానిక ఎన్నికల్లో అత్యధికం ఏకగ్రీవం చేసుకోండి – ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ దిశానిర్దేశం

పీఎం కిసాన్ 18వ విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
* స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను సందర్శించండి.
* స్టెప్ 2: హోమ్‌పేజీలో “Check Beneficiary Status” లింక్‌పై క్లిక్ చేయండి.
* స్టెప్ 3: మీ మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడి ఉపయోగించి స్టేటస్ చెక్ చేయండి.
* స్టెప్ 4: స్క్రీన్‌పై చూపిన క్యాప్‌చా కోడ్ ఎంటర్ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయండి.
* స్టెప్ 5: “Get Data” పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ చూపబడుతుంది.

రైతులకు ఉపయోగకరమైన పథకం
పీఎం కిసాన్ యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఉపశమనంగా మారింది. ఈ పథకం కింద ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 19వ విడత విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో  అర్హులైన రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు, ఇ-కేవైసీ ముందుగానే పూర్తి చేయాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం “pmkisan.gov.in” అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read  : PM Modi : దేశం కోసం మేము.. కుటుంబం కోసం కాంగ్రెస్: ప్రధాని మోదీ

మరిన్ని చూడండి

Source link