PM Modi Visits Deekshabhoomi: ఉగాది పర్వదినం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పలు ప్రదేశాలను సందర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు బుద్ధ మతాన్ని స్వీకరించిన నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిని సందర్శించారు. అక్కడున్న పవిత్ర గౌతమ బుద్ధుడి విగ్రహానికి పూజలు చేశారు. ఆయన వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
అంతకుముందు ప్రధాని నాగ్‌పూర్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకులకు నివాళులు అర్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ పరిపాలనా ప్రధాన కార్యాలయం రేషింబాగ్‌లోని స్మృతి మందిర్‌ను మోడీ సందర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, రెండో సర్ సంఘ్‌చాలక్ (అధిపతి) ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద ప్రధాని నివాళులర్పించారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ మొదటిసారి స్మారక చిహ్నాన్ని సందర్శించారు.
అనంతరం స్మారక చిహ్నం వద్ద ఉన్న స్మృతి భవన్‌లో సంస్థ కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి గ్రూప్ ఫొటోలు దిగారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. మోదీ వెంట ఫడ్నవీస్, గడ్కరీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ మాజీ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి కూడా ఉన్నారు.
మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన
ప్రభుత్వ నివేదిక ప్రకారం.. మాధవ్ నేత్రాలయమైన ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ కొత్త భవనం ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గోవాల్కర్ జ్ఞాపకార్థం ఈ సంస్థను 2104లో స్థాపించారు. ఇది ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆప్తాల్మిక్ కేర్ సెంటర్.
సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కార్యాలయ సందర్శన
సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. నిరాయుధ వైమానిక వాహనాల (UAVలు) కోసం కొత్తగా నిర్మించిన 1250 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు గల ఎయిర్‌స్ట్రిప్, లాయిటరింగ్ మునిషన్, ఇతర గైడెడ్ మందుగుండు సామగ్రిని పరీక్షించేందుకు లైవ్ మునిషన్, వార్‌హెడ్ పరీక్షా కేంద్రాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నట్లు సమాచారం.
20వ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం
చైత్ర నవరాత్రి పండుగ ప్రారంభం కావడంతో హిందూ నూతన సంవత్సరం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ ఆదివారం తన 120వ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా 2025 యోగా దినోత్సవ థీమ్‌ను ప్రకటించారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ అని వెల్లడించారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా ఓ పండుగలా జరుపుకుంటున్నారని వెల్లడించారు.
వేసవి నేపథ్యంలో పిల్లలు కొత్త అభిరుచిని అలవాటు చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగమై కొత్త నైపుణ్యాలు, అభిరుచులను పెంపొందించుకోవాలన్నారు. పాఠశాలలు, స్వచ్ఛంద సేవా సంస్థలు తాము చేపట్టే కార్యకలాపాలను #MyHolidays పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని కోరారు.
ఈరోజుల్లో పాత దుస్తులను వీలైనంత త్వరగా పడేవి కొత్తవి కొనడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని.. ఫలితంగా వస్త్ర వ్యర్థ్యాలు పెరిగిపోతున్నాయన్నారు. అలా పడేయకుండా వాటితో అలంకార వస్తువులు, హ్యాండ్ బ్యాగులు, స్టేషనరీ, బొమ్మలు వంటి అనేక వస్తువులు తయారు చేయవచ్చని తెలిపారు.
మరిన్ని చూడండి