PM Narendra Modi US Visit Modi’s Fan Flaunts ‘Nmodi’ Car Number Plate, NRI’s Prepares For Welcome

PM Modi US Visit: 

జూన్ 21న అమెరికాకు..

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మోదీని ఆహ్వానించేందుకు అమెరికాలోని భారతీయులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఘనంగా స్వాగతించేందుకు NRIలు సిద్ధమవుతున్నారు. వైట్‌హౌజ్‌ వెలుపల భారత జాతీయ పతాకాన్ని ఎగరేశారు. కొందరు యంగ్ మ్యుజీషియన్స్ వాషింగ్టన్‌లో రిహార్సల్స్ చేస్తున్నారు. ప్రధాని మోదీకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మోదీ అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మేరీలాండ్‌లోని ఓ ఫ్యాన్ తన కార్‌కి “NMODI” నంబర్ ప్లేట్‌ పెట్టుకున్నాడు. తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. “ప్రధాని మోదీ గారి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను” అని చెబుతున్నాడు. 

“ఈ నంబర్‌ ప్లేట్‌ని 2016లోనే తీసుకున్నాను. నరేంద్ర మోదీ నాకెంతో స్ఫూర్తినిచ్చారు. దేశానికి, ప్రపంచానికి మంచి చేయాలనే స్ఫూర్తిని నాకు ఆయనే నాకు ఇచ్చారు. మోదీ ఇక్కడికి వస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను”

– రాఘవేంద్ర, ప్రధాని మోదీ వీరాభిమాని

ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలు వెల్లడించారు విదేశాంగమంత్రి జైశంకర్. ఇది కచ్చితంగా దేశ గౌరవాన్ని పెంచే పర్యటన అవుతుందని తేల్చి చెప్పారు. ఈ స్టేట్ విజిట్ ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. 

“ప్రధాని మోదీ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. ఈ స్టేట్ విజిట్‌తో దేశ గౌరవం ఇంకా పెరుగుతుందన్న నమ్మకముంది. కొంత మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవమిది. భారత ప్రధాన మంత్రి యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగం ఇవ్వడం ఇదే తొలిసారి. అందుకే ఈ పర్యటనకు అంత ప్రాధాన్యత”

– జైశంకర్, భారత విదేశాంగ మంత్రి 

యూఎస్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రసంగించడమే కాదు..అక్కడి కీలక నేతలందరినీ కలవనున్నారు. అక్కడి భారతీయులతోనూ మాట్లాడనున్నారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన నేతృత్వంలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలూ జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. 
 

Source link