Power Cuts : వేసవి కాలం ఇంకా రానే లేదు. అప్పుడే పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు, నీటి కొరతకు సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడవచ్చని అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫిబ్రవరి 8న తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మ.2 గంటల వరకు దాదాపు 13 ప్రాంతాల్లో విద్యుత్ కు ఆటంకం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. అందులో గోల్డెన్ ప్లాట్స్, లావణ్య అపార్ట్మెంట్, ఫైర్ సర్వీస్ క్వార్టర్స్, మొగప్పైర్ రోడ్డు, సత్యనగర్, మథియజగన్ నగర్, చర్చిరోడ్డు, 9వ ప్రధాన రోడ్డు, 8వ వీధి, స్కూల్ స్ట్రీట్ వంటి ప్రదేశాల్లో విద్యుత్ సమస్య ఉండొచ్చన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం షెడ్యూల్ చేసిన సమయాని కంటే ముందే కరెంట్ రావచ్చని తెలిపారు.
110కి పైగా ప్రదేశాల్లో నిలిచిపోనున్న విద్యుత్ సరఫరా
తమిళనాడు రాజధాని చెన్నైలోని 110కి పైగా ప్రదేశాల్లో ఈ రోజు విద్యుత్ సరఫరా నిలిచిపోనున్నట్టు అధికారులు ప్రకటించారు. అందులో ఎస్పీ గార్డెన్, ఎస్ఆర్ఆర్ నగర్, టీచర్ సామి రోడ్, కంబర్ సలై, భారతి సలై, మీనాక్షి అవెన్యూ, ఎంజీఆర్ యూనివర్సిటీ, కాయిల్, శ్రీరామ్ నగర్, శక్తి నగర్, మలయంబాక్కం, పెరియార్ నగర్, పుదుపక్కం, పాడూర్, లోటస్ అవెన్యూ, చెన్నై న్యూ సిటీ, యూనియన్ రోడ్, నోలంబూర్ వంటి ప్రాంతాలున్నాయి.
8 గంటల పాటు విద్యుత్ కోతలు
బెంగళూరులోనూ ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ 8గంటల పాటు విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ బెస్కామ్ తెలిపింది. అటల్ భుజల్ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో కోతలు విధించనున్నటు వెల్లడించింది. ఫిబ్రవరి 8, 10, 12, 14, 16, 18 తేదీల్లో గోవిందనగర్, హౌసింగ్ బోర్డుస బీహెచ్ పాలీ, హరునహళ్లి, కుంటనమ్మనచోట, గుబ్బిగేట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో పాటు ఫిబ్రవరి 7, 9, 11, 13, 15, 17 తేదీల్లో హనుమంతపుర, ఆదర్శ నగర్, జగన్నాథపుర, నిర్వాణి లేఅవుట్, శారదేవి నగర్, కువెంపు నగర్, అనెటోటాస గణేష్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉండనున్నాయి. ఇదే సమయంలో విద్యుత్ అంతరాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని నివారించేందుకు నివాసితులు తమ పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, తమకు సహకరించాలని అధికారులు సూచించారు.
నీటి కొరత నివారణకు చర్యలు
వేసవిలో నీటి కొరత తలెత్తకుండా అధికారులు ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక సిబ్బందితో తిరిగి నీటి శుద్ధి ప్లాంట్లను పరిశీలించి సమస్యలు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గతంవో జూరాలలో నిల్వనీరు పూర్తిగా ఖాళీ కావడంతో కర్ణాటక నుంచి నీటిని తెప్పించుకోవాల్సి వచ్చిన విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లడంతో అటువంటి సమస్యలను అధిగమించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read : LIC Warning: పాలసీహోల్డర్లకు ఎల్‌ఐసీ తీవ్ర హెచ్చరిక – అలా చేయొద్దని వార్నింగ్
మరిన్ని చూడండి