Prabhas-starrer Spirit to go on floors in May ప్రభాస్ స్పిరిట్ మొదలయ్యేది ఎప్పుడంటే..


Fri 31st Jan 2025 02:20 PM

prabhas  ప్రభాస్ స్పిరిట్ మొదలయ్యేది ఎప్పుడంటే..


Prabhas-starrer Spirit to go on floors in May ప్రభాస్ స్పిరిట్ మొదలయ్యేది ఎప్పుడంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ తో పాటుగా హను రాఘవపూడి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పని లో ఉండగా.. ఆయన షూటింగ్స్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకురాబోతున్నారనే వార్తతో ఇప్పుడు రాజా సాబ్ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరోపక్క ఈ సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవ్వాల్సిన స్పిరిట్ రెగ్యులర్ షూట్ కూడా వాయిదా పడింది అని తెలుస్తుంది. 

సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం స్పిరిట్ అనుకున్న తేదీ ప్రకారం మొదలు కావడం లేదు. సంక్రాంతి తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్ తో సెట్స్ మీదకి వెళతారని నిర్మాత చెప్పారు. కానీ ఇప్పుడు స్పిరిట్ మే నుంచి మొదలవుతుంది అంటున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా చుట్టూ స్పిరిట్ కథ అల్లారని తెలుస్తుంది. 

నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కాస్త రఫ్ లుక్ లో స్పిరిట్ లో కనిపిస్తాడనే టాక్ ఉంది. ప్రభాస్ కి పెయిర్ గా బాలీవుడ్ నుంచి టాప్ హీరోయిన్ ని సందీప్ రెడ్డి వంగ సెలెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. 


Prabhas-starrer Spirit to go on floors in May:

Sandeep Reddy Vanga and Prabhas Spirit to go on floors in May





Source link