Prabhas to Begin Hanu Film First ప్రభాస్-హను మూవీ పట్టాలెక్కేది అప్పుడే!


Wed 01st May 2024 04:08 PM

prabhas  ప్రభాస్-హను మూవీ పట్టాలెక్కేది అప్పుడే!


Prabhas to Begin Hanu Film First ప్రభాస్-హను మూవీ పట్టాలెక్కేది అప్పుడే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ మాములుగా లేదు. సలార్ పార్ట్ 1 తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రభాస్ తదుపరి కల్కి 2898 AD తో జూన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కల్కి షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ కి హాజరవుతున్నారు. ఆ తర్వాత ఆయన సలార్ పార్ట్ 2 ని మొదలు పెడతారా లేదంటే సందీప్ వంగతో కలిసి స్పిరిట్ మూవీని మొదలు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. 

ఈలోపులో సీతారామం దర్శకుడు హను రాఘవపుడితో మరో మూవీకి కమిట్ అయిన ప్రభాస్.. హను తో కలిసి మరో రెండు నెలలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కల్కి రిలీజ్ తర్వాత రాజా సాబ్ ని పూర్తి చేసి.. ఆతరవాత హను రాఘవపూడి సినిమాతో పాటుగా, స్పిరిట్ సెట్స్ లోకి వెళతారని అంటున్నారు. 

ఆతర్వాతే సలార్ పార్ట్ 2 షూటింగ్ అంటూ వార్తలోస్తున్నాయి. అటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ 31 మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. అందుకే ప్రభాస్ ముందుగా ఈ చిత్రాలని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్. 


Prabhas to Begin Hanu Film First:

Prabhas – Hanu Raghavapudi combo movie update





Source link