ByGanesh
Wed 29th Jan 2025 07:09 PM
దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో రీసెంట్ గా మొదలు పెట్టిన చిత్రం కోసం చాలా బిగ్ ప్లాన్స్ వేస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను SSMB 29 కోసం లాక్ చెయ్యడం, ఆమెపై అల్యూమినియం ఫ్యాక్టరీలో అప్పుడే సన్నివేశాలను కూడా తెరకెక్కించేస్తున్నారు. తాజాగా మహేష్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ ని ఎంపిక చేశారట రాజమౌళి.
ఆయనే జాన్ అబ్రహం. కానీ జాన్ అబ్రహం SSMB 29 నుంచి తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి రాజమౌళి మలయాళ సూపర్ స్టార్, ప్రభాస్ ఫ్రెండ్ అయినా పృథ్వీరాజ్ సుకుమార్ ను ఎంపిక చేసినట్లుగా టాక్ వినబడుతుంది. ప్రభాస్ తో సలార్ చిత్రంలో ఫ్రెండ్ కేరెక్టర్ చేసి పార్ట్ 2 లో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న పృథ్వీ రాజ్ ను మహేష్ కు విలన్ గా రాజమౌళి ఎంపిక చేశారట.
కేరళ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన రాజమౌళి పృధ్విరాజ్ అయితే బాగుంటుందని అందుకే ఆయన్ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అటు పృథ్వీరాజ్ కూడా SSMB 29పై ఇంకా చర్చలు జరుగుతున్నాయ్ ఫైనల్ కాలేదు అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
మరి మహేష్ చిత్రంలో ఆయనది విలన్ పాత్రా లేదంటే ఊహాజనితామా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క రాజమౌళి తన చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న విషయము తెలిసిందే.
Prithviraj Sukumaran in SSMB29:
Prithviraj Sukumaran Reacts SSMB29 rumours