Pv Sindhu Wedding:ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లిపీటలెక్కింది. వెంకటదత్త సాయితో ఏడడుగులు వేసింది. ఈ జంట వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఆదివారం రాత్రి 11.20 నిమిషాలకు సింధు మెడలో వెంకట దత్త సాయి మూడుముళ్లు వేశాడు. తెలుగు సంప్రదాయ పద్దతిలో సింధు, దత్త సాయి పెళ్లి జరిగింది. ఈ జంట పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితుల సహా 140 మంది వరకు అతిథులు హాజరైనట్లు తెలిసింది. సింధు కుటుంబానికి సన్నిహితులైన చాముండేశ్వరినాథ్, గురువారెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు.