Rail hijack and army officers kidnap in beluchistan

Pakistan Train Hijack: పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో ఇప్పుడు బలూచిస్థాన్ వేర్పాటు వాదులు చెలరేగిపోయారు. భద్రతా దళాలు సెలవు పై పాకిస్తాన్లోని పంజాబ్ కు వెళుతుండగా  వారు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసింది అక్కడి వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA ). వంద మందికి పైగా భద్రతా దళాల సిబ్బందిని ఎత్తుకుపోయారు. వారిలో  అర్మీ, ISI, యాంటీ -టెర్రరిజం ఫోర్స్, పోలీస్ దళాలకు చెందిన అధికారులు ఉన్నారు.

రూరల్ సిబీ ప్రాంతం లో ట్రాక్ పై బాంబులు వేసి ట్రైన్ ను హైజాక్ చేసిన BLA చిన్నపిల్లలు మహిళలను మాత్రం వదిలేశారు. తమపై దాడులు చేస్తే తమ దగ్గర బందీలుగా ఉన్న  పాక్ భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలకు ముప్పు అని హెచ్చరించారు బెలూచిస్తాన్ వేర్పాటువాదులు. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ కు దగ్గరలో ఉంటుంది. పూర్తిగా పర్వతాలతో నిండిన ప్రాంతం. ఇక్కడ బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం తో పోరాడుతున్నారు. దానితో పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున సైనిక సంక్షోభం మొదలైంది.

ఏంటి బెలూచిస్తాన్ గొడవ -పాక్ నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు

 భారతదేశాన్ని విభజించి ఇండియా పాకిస్తాన్ లను ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం రెండు దేశాల్లోని  స్వతంత్ర ప్రతిపత్తి గల రాజస్థానాలను  తమకు నచ్చిన దేశంలో విలీనం అయ్యే అవకాశం ఇచ్చారు. వాటినే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. భారతదేశంలోని చిన్నాచితకా రాజ్యాలు 500 పైచిలుకు ఉండేవి. ఇవన్నీ భారతదేశంలో కలిసిపోయాయి. జునాగడ్, హైదరాబాద్ లాంటి పెద్ద రాజ్యాల పాలకులు మొదట్లో విభేదించినా ఆయా రాజ్యాల లోని ప్రజల ఒత్తిడి మేరకు చివరికి ఇండియాలోనే కలిసిపోయాయి.

అలాగే పాకిస్తాన్లోని బెలూచ్ ప్రాంతం గా చెప్పబడే ” ఖానైట్ ఆఫ్ కలత్ ” రాజ్యం భారత్ లో కలవాలి అనుకుంది. అయితే ఆ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామంటూ పంపించిన పాక్ ప్రభుత్వం 14 అక్టోబర్ 1955 న తమ దేశంలో కలిపేసుకుంది. మొదట్లో స్వయం ప్రతిపత్తి ఇచ్చినా 1973 లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దాన్ని రద్దుచేసేశారు.అప్పటికే పాక్ ప్రభుత్వంపై  ఒకటి రెండుసార్లు తిరుగుబాటు చేసిన బెలూచ్ ప్రజలు తర్వాత మరింత రెచ్చిపోయారు. తమ ప్రాంతానికి ప్రత్యేక  ప్రతిపత్తి  ఇవ్వండి లేదా వేరే దేశంగా విడిపోతామంటూ చాలాసార్లు తిరుగుబాట్లు చేశారు. మధ్యలో వారికి పాక్ ప్రధాన్లు సర్థి చెబుతూ కాలం గడుపుతూ వచ్చారు.

ముసారఫ్ చేతుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు  బెలూచిస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక లేడీ డాక్టర్ షాజియా పై అత్యాచారం జరగడం ఆ ఘటనలో నిదుతుడ్ని ముషారఫ్ నిర్దోషి గా ప్రకటించడంతో  బెలూచ్ ప్రాంతంలో  శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. బెలూచిస్థాన్ స్వతంత్రం కోసం అక్కడ చాలా సంస్థలే పోరాడుతున్నా వాటన్నిoటిలోకి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ  (BLA ) అతి పెద్దది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులను ఎత్తుకుపోయింది ఆ గ్రూపే.

 చైనా -పాక్ కారిడార్ వల్లే అసలు సమస్య 

 చైనా తమ దేశం నుండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గరగా నిర్మిస్తున్న కారిడార్ బెలూచిస్థాన్ వరకు వెళుతోంది. ఆ ప్రాంతంలో  విలువైన ఖనిజనిక్షేపాలు ఉన్నాయి. వాటికోసం తమ హక్కులకు పూర్తిగా  భంగం కలిగిస్తారని  చైనా తో కలిసి  పాక్ ప్రభుత్వం తమ పైనే దాడులు చేసే ప్రమాదం ఉందని బెలూచ్ ప్రజలు ఆరోపిస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ ఉద్రిక్తతలు తారా స్థాయికి వెళ్లాయి. వీటన్నిటి నేపథ్యంలోనే  పాక్ భద్రతా దండాల అధికారుల  కిడ్నాప్ జరిగింది. ఒక్కసారిగా పాక్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన ఈ ఘటన ఎన్ని ములుపులకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link