Rainfall Activity To Increase Over Northwest India Between Aug 3 And Aug 6 Says IMD | Weather Update: మరో 4 రోజులు భారీ వర్షాలు, హెచ్చరించిన భారత వాతావరణ శాఖ

Weather Update: దేశంలోని చాలా ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయో మూడు, నాలుగు రోజులు తూర్పు, సెంట్రల్ ఈస్ట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తర ఒడిశాలో ఆగస్టు 2 వ తేదీ వరకు, తూర్పు మధ్యప్రదేశ్ లో ఆగస్టు 3 వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాయువ్య భారతదేశంలో ఆగస్టు 3 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాబోయే మూడ్రోజులు మహారాష్ట్రలోనూ వానలు పడతాయన్నారు. 

వాయువ్య భారత్ లో వర్షపాతం

  • ఆగస్టు 1-5 తేదీల్లో ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 3-5 మధ్య హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 2-5 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్ లో వర్షాలు కురుస్తాయి.
  • తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఆగస్టు 3 వరకు, ఉత్తరాఖండ్ పై ఆగస్టు 3 నుంచి 5 వరకు, హిమాచల్ ప్రదేశ్ లో ఆగస్టు 3 నుంచి 4 తేదీల్లో వర్షాలు కురుస్తాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్ లో గురువారం రోజు భారీ వర్షాలు కురుస్తాయి.
  • పశ్చిమ భారత్ లో వర్షపాతం
  • వచ్చే 5 రోజుల్లో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
  • ఆగస్టు 1, 4, 5 తేదీల్లో మరఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
  • దక్షిణ భారత్ లో వర్షపాతం
  • ఆగస్టు 2, 4 తేదీల మధ్య కోస్తా కర్ణాటకలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
  • మరో రెండ్రోజులు కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
  • తూర్పు భారత్ లో వర్షపాతం
  • ఆగస్టు 1-5 మధ్య బీహార్ లో, ఆగస్టు 1-3 మధ్య ఒడిశాలో వర్షాలు పడతాయి. ఆగస్టు 1, 2 తేదీల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షపాతం నమోదు అవుతుంది. ఆగస్టు 1 -4 తేదీల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో వర్షాలు పడతాయి.
  • ఈశాన్య భారత్ లో వర్షపాతం
  • రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మేస్తరాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 1వ తేదీన త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఆయా జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

‘‘ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 1) ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.

Source link