ByGanesh
Thu 30th Jan 2025 09:32 PM
రష్మిక మందన్న ఈమధ్యన గాయం బారిన పడి కోలుకుంటుంది. రీసెంట్ గా ఆమె నటించిన చావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వీల్ చైర్ లో హాజరవడంతో రష్మిక డెడికేషన్ ను అందరూ ప్రశంసించారు. చావా ఈవెంట్ లో రష్మిక వేసుకున్న డ్రెస్ తో తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.
చావా సినిమాలో రష్మిక ఎలాంటి కేరెక్టర్ లో ఎలాంటి వస్త్రధారణతో కనిపించిందో అదే వస్త్ర ధారణతో రష్మిక చావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించింది. ఇప్పుడు అదే ఫోటో షూట్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. Red ❤🌹 అంటూ రష్మిక తన పిక్స్ ని షేర్ చెయ్యగానే ఆమె లుక్ చూసి అభిమానులు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక రష్మిక కు మరో బిగ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది అనే టాక్ వినబడుతుంది. ఆమెకు మరోసారి సల్మాన్ ఖాన్ చిత్రంలో ఛాన్స్ వచ్చిందట. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రంలో నటిస్తున్న రష్మిక అట్లీ చిత్రంలోను హీరోయిన్ గా ఎంపికయ్యిందినే వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యింది.
Rashmika in red:
Rashmika Mandanna in red