ByGanesh
Tue 25th Feb 2025 07:40 PM
పుష్ప ద రూల్, చావా తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రష్మిక మందన్న ఇపుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. హిందీ తారలతో సమానమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాదు అక్కడి హీరోయిన్స్ కి రష్మిక గట్టి పోటీ ఇస్తుంది.
గ్లామర్ గానే కాదు, పెరఫార్మెన్స్ పరంగాను బాలీవుడ్ దర్శకనిర్మాతలు రశ్మికను చూజ్ చేసుకోవడం నిజంగా ఆమె లక్ అనే చెప్పాలి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీలో నటిస్తుంది. తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిసున్న ఈచిత్రంలో రష్మిక మెయిన్ హీరోయిన్ కాగా కాజల్ మరో కేరెక్టర్ లో కనిపించబోతుంది.
ఇక చావా ప్రమోషన్స్ లో రష్మిక ట్రెడిషనల్ గా మెరిసినా ఆమె కాలు నెప్పితో ఇబ్బందిపడింది. వీల్ చైర్ లోనే రశ్మిక చావా ప్రమోషన్స్ లో కనిపించింది. చావా ప్రమోషన్స్ లోని లుక్ ని I wishhhhh life could always feel like these images 🩷🩷🩷 just happy, bright, playful and funnnnn… you agree no? అంటూ క్యాప్షన్ పెట్టి మరీ రష్మిక ఆ పిక్స్ షేర్ చేసింది. పింక్ రోజ్ లా రష్మిక బ్యూటిఫుల్ గా కనిపించింది. గ్లామర్ కనిపించలేదు కానీ ఆమె అందం ఆ పింక్ డ్రెస్ లో ద్విగుణీకృతం అయ్యింది.
Rashmika new look goes viral:
Rashmika Mandanna latest look viral