Rashtriya Chemicals and Fertilizers Limited has released notification for the recruitment of Apprentice posts check details here

Rashtriya Chemicals and Fertilizers Limited Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(RFCL) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 378 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఖాళీలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు డిసెంబర్‌ 24లోనగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

వివరాలు…

మొత్తం ఖాళీల సంఖ్య: 378. 

పోస్టుల కేటాయింపు: జనరల్-156, ఓబీసీ-101, ఈడబ్ల్యూఎస్-37, ఎస్సీ-56, ఎస్టీ-28.

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 182 ఖాళీలు 

శిక్షణ వ్యవధి: 12 నెలలు. 

విభాగాలవారీగా ఖాళీలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్-51, సెక్రటేరియల్ అసిస్టెంట్-96, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(హెచ్‌ఆర్)-35.

అర్హతలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 50 శాతం మార్కులతో బీకాం, బీబీఏ లేదా డిగ్రీ(ఎకనామిక్స్); సెక్రటేరియల్ అసిస్టెంట్, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(హెచ్‌ఆర్) పోస్టులకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

2) టెక్నీషియన్ అప్రెంటిస్: 90 ఖాళీలు 

శిక్షణ వ్యవధి: 12 నెలలు. 

విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్-20, సివిల్-14, కంప్యూటర్-06, ఎలక్ట్రికల్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్-20, మెకానికల్-20.

అర్హత: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

3) ట్రేడ్ అప్రెంటిస్: 106 ఖాళీలు

శిక్షణ వ్యవధి: కొన్ని విభాగాలకు 12 నెలలు, కొన్ని విభాగాలకు 24 నెలలు, కొన్ని విభాగాలకు 15 నెలల శిక్షణ ఉంటుంది. 

విభాగాలవారీగా ఖాళీలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)-74, బాయిలర్ అటెండెంట్-03, ఎలక్ట్రీషియన్-04, హార్టికల్చర్ అసిస్టెంట్-06, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్(కెమికల్ ప్లాంట్)-03, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్)-14, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ)-02. 

అర్హత: ట్రేడును అనుసరించి పదోతరగతి, ఇంటర్, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.12.2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; 1984 అల్లర్ల బాధితులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అభ్యర్థుల అకడమిక్ మెరిట్‌, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తుది ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 శాతం మినహాయింపు వర్తిస్తుంది.

స్టైపెండ్: నెలకు రూ.7000 నుంచి రూ.9000. 

శిక్షణ ప్రదేశాలు: ట్రాంబే (ముంబయి), థాల్ (రాయ్‌గఢ్ జిల్లా). 

అభ్యర్థులు రిపోర్టింగ్ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ తాజాగా దిగిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికేట్
➥ అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు
➥ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్
➥ కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) – ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే.
➥ ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) – బీసీ అభ్యర్థులకు
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ – ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు

ముఖ్యమైన తేదీలు… 

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 10.12.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 24.12.2024. 

Notification

Online Application

Website

Trade Apprenticeship (NAPS) registration

Technician apprentices or diploma holder and Graduate
apprentices or degree apprentices shall registration as a student

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

ALSO READ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Source link