Rave party busted in Madhapur డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న నిర్మాత


Thu 31st Aug 2023 11:34 AM

madhapur  డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న నిర్మాత


Rave party busted in Madhapur డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న నిర్మాత

టాలీవుడ్ లో ప్రతిసారి డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ అవుతుంది. డ్రగ్స్ కేసుల్లో పలువురిని అరెస్ట్ చెయ్యడం, తర్వాత అది విచారణకు వెళ్లడం, విచారణలో పలువురు సెలబ్రిటీస్ ని అధికారులు ప్రశ్నించడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మాదాపూర్ విఠల్ రావు నగర్ లోని లివింగ్ అపార్ట్మెంట్స్ లో జరుగుతున్న రేవ్ పార్టీలో అనేకమందిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, అందులో టాలీవుడ్ నిర్మాత ఒకరు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ పార్టీలో పోలీస్ లు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

టాలీవుడ్లో పలు సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా, మరికొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన వెంకట్ అనే వ్యక్తితో పాటుగా మరో ఐదుగురిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూల రంగడు, లవ్లీ, ఆటో నగర్ సూర్య చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గా చేసిన వెంకట్ తో సహా పలువురు ప్రముఖులని పోలీస్ లు అరెస్ట్ చేసారు. అయితే  ఈ పార్టీకి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. 

ఈ పార్టీలో సినిమా రంగానికి సంబందించిన కొంతమంది యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత వెంకట్ కదలికలపై పోలీస్ లు గత మూడు నెలలుగా నిఘా పెట్టడంతో ఈపార్టీ గుట్టు రట్టయినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అంటున్నారు. 


Rave party busted in Madhapur:

 Madhapur drugs case: Five arrested along with Film financier Venkat kpr





Source link