Roller Coaster Riders Stuck Upside Down In Roller Coaster For Three Hours Due To Technical Problem | Roller Coaster: మధ్యలో ఆగిపోయిన రోలర్ కోస్టర్, 3 గంటలు తలకిందులు

Roller Coaster: రోలర్ కోస్టర్.. ఈ పేరు వింటేనే భయపడే వాళ్లు చాలా మంది. ఇక దీన్ని ఎక్కి ఆ ఎక్స్ పీరియన్స్ లా ఉంటుందో చూసే వాళ్లు కూడా కోకొల్లలు. విపరీతంగా భయపడిపోతూనే రోలర్ కోస్టర్ ఎక్కేస్తుంటారు. అరుస్తూ, కేకలు పెడుతూ.. దాన్ని ఎంజాయ్ చేస్తారు. మరికొంత మంది అయితే వాంతులు చేసుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి కూడా మనం చాలానే చూస్తుంటాం. ఓ ఐదు నిమిషాలకే జనాలంతా తెగ ఇబ్బంది పడిపోతుంటే.. కొన్ని గంటల పాటు రోలర్ కోస్టర్ పైనే ఉంటే మరెలా ఉంటుందో ఆలోచించండి. తిరుగుతూ తిరుగుతూ ఉన్న ఓ రోలర్ కోస్టర్ ఒక్కసారిగా పైకి వెళ్లి ఆగిపోయింది. చాలా మంది జనాలు తలకిందులుగానే ఉండిపోయారు. అయితే రోలర్ కోస్టర్ లో ఏర్పడ్డ ఓ సాంకేతిక సమస్య వల్ల మూడు గంటల పాటు అలాగే ఉండాల్సి వచ్చింది. ప్రాణాలు అరచేత పట్టుకొని జనాలు ఎప్పుడెప్పుడు తమను కిందకు దించుతారా అని క్షణాన్ని యుగంలా గడిపారు. 

అసలేం జరిగిందంటే..?

అమెరికాలోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే చాలా మంది రోలర్ కోస్టర్ రైడ్ కు వెళ్లారు. ఈ రైడ్ స్టార్ట్ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య తెలత్తింది. మధ్యలోనే ఆగిపోయింది. ఇంకేముంది.. రైడ్ కు వెళ్లిన వారంతా తలకిందులుగా వేలాడుతూ… అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏమాత్రం పట్టు తప్పినా వారి ప్రాణాలు పోయేవే. ఇలా మూడు గంటల పాటు ప్రజలంతా ప్రాణాలు అర చేత పట్టుకొని అలాగే ఉండిపోయారు. మూడు గంటల తర్వాత సమస్యను పునరుద్ధరించి వారందరినీ క్షేమంగా కిందకు దించారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్కేయండి. 

జులై 4వ తేదీ మంగళ వారం రోజు సాయంత్రం 5.23 గంటలకు ఈ వీడియోను Sasha White అనే వినియోగదారురాలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాసేపటికే నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఇప్పటి వరకు వేలల్లో వ్సూయస్ రాగా వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇంత భయంకరమైన రైడ్ నేనెప్పుడూ చూడలేదని కొందరు.. ఎక్స్ పీరియన్స్ అదిరిందా ఫ్రెండ్స్ అని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల అంతా ప్రాణాలతో బయట పడ్డారంటూ పలువురు నెటిజెన్లు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు.

Source link