– అకౌంట్ మార్చుకునే రైతులు తమ కొత్త అకౌంట్ పాస్ బుక్ జీరాక్స్ లను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
-రైతుబంధు కొత్త రైతుల దరఖాస్తు – చివరి తేదీల వివరాలను వ్యవసాయశాఖ నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తేలియజేయనున్నారు.
– జూన్ 26 వ తారీఖు నుండి గతంలో రైతు బంధు అందుకున్న రైతులకు రైతు బంధు నిధులు జమ కావడం ప్రారంభం అవుతాయి.
– కొత్త రైతులకు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ వివరాలు నమోదు చేసిన తదుపరి చివరిలో జమ అవుతాయి.
రైతు బంధు పథకం కింద ప్రతీ ఎకరానికి వానాకాలం, యాసంగి సీజన్లో రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సీజన్లో కూడా ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది సర్కార్. వారికి కూడా ఇదే ఏడాది నుంచే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, లబ్ధిదారుడి మొబైల్ నంబర్ తదితర వివరాలను అప్లోడ్ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో పడ్డారు.