ByGanesh
Sat 13th Jan 2024 08:20 AM
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లోనే మైలు రాయి గా నిలిచిపోయే 75 చిత్రాన్ని యంగ్ డైరెక్టర్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో చేసారు. సైంధవ్ అంటూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తో ఈ సంక్రాంతి కి వచ్చేసారు. గత నెలరోజులుగా సైంధవ్ ప్రమోషన్స్ తో విక్టరీ వెంకటేష్ చాలా హుషారుగా, ఎనేర్జిగా కనిపించారు. పబ్లిక్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ సైంధవ్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. తమిళ హీరో ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్న సైంధవ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో సైంధవ్ షోస్ కంప్లీట్ అయ్యాయి. మరి సినిమా చూసాక ప్రేక్షకులు ఆగుతారా… సోషల్ మీడియా వేదికగా సైంధవ్ సినిమా ఇలా ఉంది అలా ఉంది అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
సైంధవ్ ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. వెంకటేష్ కొత్త అవతారం నెవర్ బిఫోర్ లా ఉంది.. అంటూ వెంకీ అభిమానులు స్పందిస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో మొదటి 30 నిమిషాలు చాలా స్లోగా ఉంటుంది. సైంధవ్ స్టోరి లైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గుడ్ యాక్షన్ సీక్వెన్స్, ఫెర్ఫార్మెన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. BGMకు చాలా స్కోప్ ఉంది. కానీ అదిఅంతగా ఆకట్టుకోలేదు అంటూ మరొకరు ట్వీట్ చేసారు. సైంధవ్ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి కానీ.. డ్రామా పార్ట్ ఫ్లాట్‌గా ఉంది. కొన్ని చోట్ల హైస్ ఉన్నాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ చాలా వీక్‌గా ఉంది అంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేసాడు. యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి అని మరో ఆడియెన్ కామెంట్ చేశారు. సైంధవ్ మూవీ చాలా ఫ్లాట్‌గా ఉంది. ఓవరాల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది అంటూ మరికొందరు సైంధవ్ చూసి స్పందిస్తున్నారు.
Saindhav Overseas Public Talk:
Saindhav Social Media talk