Salaar Teaser Review వైలెన్స్ సలార్ ది సాగా భీభత్సం


Thu 06th Jul 2023 05:42 AM

salaar  వైలెన్స్ సలార్ ది సాగా భీభత్సం


Salaar Teaser Review వైలెన్స్ సలార్ ది సాగా భీభత్సం

ఉదయం 5.12 నిమిషాలకి సలార్ టీజర్ అనగానే.. హా అందరూ అలారం పెట్టుకుని లేవాలా అంటూ సాధారణ ఆడియన్స్, మీమర్స్ కామెడీ చేసినా ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నైట్ అంతా నిద్ర పోకుండా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ టీజర్ కోసం తెగ వెయిట్ చేసారు. సలార్ ది సాగ అంటూ ఫస్ట్ లుక్స్ తోనే భీభత్సమైన అంచనాలను క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ని మాస్ గా చూపించబోతున్నారని తెలిసినా అది ఎలాంటి మాసో అంటూ ఆత్రం ప్రదర్శించారు.

ప్రశాంత్ నీల్ KGF కి మించి సలార్ ని డిజైన్ చేశారనేది అర్ధమయ్యేలా సలార్ టీజర్ అడుగడునా కనిపించింది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా  ప్రభాస్ ఫాన్స్ ని అలెర్ట్ చేస్తూ అలారం మోగినట్టుగా సలార్ టీజర్ 5.12 నిమిషాలకి వచ్చేసింది. మాఫియాకు బాస్, బడా గ్యాంగ్‌స్టర్ పాత్రకు ప్రభాస్ కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు అన్నట్టుగా సలార్ టీజర్ స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ కి ఫాన్స్ మెచ్చే ఎలివేషన్ ఇస్తూ.. సలార్ టీజర్ మొదలైంది. లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్. అయితే.. జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్ లో అంటూ  ప్రభాస్ ను పరిచయం చేసిన తీరుకి ఫాన్స్ కి అయితే గూస్ బమ్ప్స్ పక్కా. 

టీజర్ ఎండింగులో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా జస్ట్ పరిచయంతో ఆపేసారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ అంతటా కనిపించింది. రెండు పార్టులుగా సలార్ విడుదల కానుందని టీజర్ తోనే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేసారు. 


Salaar Teaser Review:

Prabhas Salaar Teaser out





Source link