ByGanesh
Tue 14th Jan 2025 09:51 AM
విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి అంటే కామెడీ ఎంటర్టైనర్స్ ఎఫ్ 2, ఎఫ్ 3 గుర్తుకు రావాల్సిందే. వారి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఈ సంక్రాంతి పండగకి పండగ కళ తెచ్చేలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. టైటిల్ లోనే కాదు, కంటెంట్ లోను సంక్రాతి పండగ వైబ్స్ చూపించిన అనిల్ రావిపూడి ప్రమోషన్స్ పరంగాను ఫ్యామిలీ ఆడియన్స్ ను పడెయ్యడంలో అనిల్ అండ్ టీం సక్సెస్ అయ్యారు.
నేడు జనవరి 14 న సంక్రాతి స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి వస్తున్నాం ప్రీమియర్ టాక్ లోకి వెళితే.. దగ్గుబాటి ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని వీక్షించి సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ రెచ్చిపోయి ట్వీట్లు పెడుతున్నారు. అనిల్ రావిపూడి తన టిపికల్ మార్క్ కామెడీతో మరోసారి ఆడియెన్స్ ని పడేసాడు, సినిమా మొత్తం మీద వెంకటేశ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అని.. ఆ తర్వాత బుల్లిరాజు క్యారెక్టర్ కామెడీ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారంటూ కామెంట్ చేస్తున్నారు.
వెంకటేష్ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయ్యింది. ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న భీమ్స్ అందించిన పాటలు సినిమాకు మరింత బలం, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి యాక్టింగ్ బాగుంది, వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముగ్గురి కాంబో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అంటూ సినిమాని వీక్షించిన నెటిజెన్స్ ట్వీట్లు వేస్తున్నారు.
Sankranthiki Vasthunnam Premiere talk:
Sankranthiki Vasthunnam overseas Premiere talk