Sankranti Movies OTT Dates సంక్రాంతి సినిమాల OTT డేట్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ ప్రాజెక్టులు థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించాయి. అయితే వెంకటేశ్ సినిమా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు వీటన్నింటి ఓటీటీ రిలీజ్‌లు కూడా పోటీ పడే అవకాశం ఉంది.

గేమ్ చెంజర్ 

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా గేమ్ చెంజర్ జనవరి 10న విడుదలై మొదటిరోజే రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఫేక్ కలెక్షన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో ఆ తర్వాత వివరాలు వెల్లడించలేదు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డాకు మహారాజ్ 

నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించిన సినిమా. కానీ నైజాం, హిందీ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న విడుదలై సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ మార్క్‌కి చేరువైంది. ఈ సినిమా ఫిబ్రవరి 2వ వారంలో జీ5లో స్ట్రీమింగ్‌కి రావాల్సి ఉంది. అయితే థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగుతుండటంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడే అవకాశముంది. ఫిబ్రవరి మూడో వారంలో స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Source link