Satya Nadella Shares Video Of AI Powered Farming In India Elon Musk Reacts | Elon Musk: సత్య నాదెళ్లను కాకా పడుతున్న ఎలాన్ మస్క్

Satya Nadella And Elon Musk: ఊరకనే రారు మనహానుభావాలు అని మన తెలుగులో ఓ సామెత ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరైనా నేరుగా వచ్చి కలిసేది తక్కువ కాబట్టి సోషల్ మీడియాలో పలకరింపులకు దీన్ని అన్వయించుకోవచ్చు. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చేసిన ట్వీట్లకు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అదే పనిగా స్పందిస్తున్నారు . దీంతో ఏదో ఉందో అని టెక్ ప్రపంచం అనుకుంటోంది. 

తాజాగా సత్యనాదెళ్ల ఇండియాలో రైతులు ఏఐ పవర్  ఎలా వినియోగిచుకుంటున్నారో  ట్వీట్ చేశారు. దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. భవిష్యత్ లో అన్ని రంగాల్లో ఏఐ మార్పులు తెస్తుందన్నారు.  

మూడు రోజుల కిందట.. మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో కొత్త ఆవిష్కరణను వెల్లడించింది. దీనిపైనా ఎలాన్ మస్క్ స్పందించారు. ఇంకా చాలా చాలా బ్రేక్ త్రూలు .. క్వాంటమ్ కంప్యూటింగ్ లో రావాల్సి ఉందన్నారు. 

lదీనికి సత్యనాదెళ్ల కూడా స్పందించారు. 

కొద్ది రోజుల కిందట.. ఓపెన్ ఏఐతో పాటు మరో రెండు బడా కంపెనీలు కలిసి ఓ భారీ ప్రాజెక్టును ప్రకటించాయి. అయితే వారి వద్ద అంత డబ్బు లేదని అలాంటివి చేయలేరని ఎలాన్ మస్క్ తీసి పడేశారు. ఈ అంశంలో నూ ఎలాన్ మస్క్ సత్యనాదెళ్లను తీసుకు వచ్చారు. సత్య వద్ద అంత డబ్బు ఉంటుందని.. ఆయన చేయగలరని చెప్పుకొచ్చారు.                          

ఇలా అవసరం ఉన్నా లేకపోయినా.. సత్యనాదెళ్లను ఎలాన్ మస్క్ పాంపరింగ్ చేసే ప్రయత్నం చేయడం టెక్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓపెన్ ఏఐతో మస్క్ లొల్లి పెట్టుకున్నారు. దాన్ని కొనేయాలని అనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ లేదని ఓపెన్ ఏఐ యజమానికి.. ఒకప్పుడు మస్క్ తో కలిసి పని చేసిన శామ్ అల్ట్ మన్ తేల్చేశారు. రివర్స్ లో కావాలంటే ట్విట్టర్ ను కొంటానని అంటున్నారు. ఎలాగైనా ఓపెన్ ఏఐని దెబ్బకొట్టాలనుకుంటున్న మస్క్..మైక్రోసాఫ్ట్ సాయం తీసుకోవాలనుంటున్నారని..అందుకే ఇలాంటి చర్చ సాగదీస్తున్నారని భావిస్తున్నారు. మరి మస్క్ మనసులో ఏముందో ?                                         

Also Read:  ఇండియాపై గెలవకపోతే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదన్నాడు పాకిస్తాన్ ప్రధాని – ఇప్పుడు ఆయనకు ఎన్ని పేర్లు పెడుతున్నారంటే ?

మరిన్ని చూడండి

Source link