SC Categorization: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌గా అమలు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై మాదిగ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణకు అమోదం లభించడంతో త్వరలో డిఎస్సీ వెలువడనుంది.