కాచిగూడ – కాకినాడ టౌన్….
కాచిగూడ – కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్ ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు జులై 1వ తేదీన రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి… మరునాడు ఉధయం 7.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో…. ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.