Shiv Shakti Aksh Rekha:మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వాటి నిర్మాణాల్లో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ అలానే ఉండిపోయాయి. వాటిలో ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్న కేదార్ నాథ్ ఆలయం నుంచి దక్షిణాదిన ఉన్న రామేశ్వరం మధ్య లోతైన రహస్యం ఉందంటారు. ఈ రెండూ శివాలయాలే..రెండూ జ్యోతిర్లింగాలే. వీటి మధ్య దూరం 2383 కిలోమీటర్లు. ఈ రెండింటిని కలుపుకుని మొత్తం 7 శివాలయాలు ఒకే సరళరేఖపై న్నాయి.
శివశక్తి అక్షరేఖ
పంచభూత లింగాలు, జ్యోతిర్లింగాలు కొలువైన ఈ క్షేత్రాలు 4 వేల ఏళ్లక్రితం నిర్మించారు. ఆ కాలంలో ఓ ప్రదేశం అక్షాంశం, రేఖాంశాలను కొలిచేందుకు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. అయినా కూడా ఈ ఆలయాలు స్పష్టమైన సరళ రేఖలో నిర్మించారు. ఇవన్నీ వేర్వేరు సమయాల్లో నిర్మించారు. మరి ఒకే సరళరేఖపైకి వచ్చేలా ప్రత్యేకమైన ఆలోచనతో నిర్మించారా లేదంటే యాదృశ్చికంగా ఇలా జరిగిందా అన్నది ఎవరూ చెప్పలేరు. ఈ ఆలయాలను కలిపే రేఖని ‘శివశక్తి అక్షరేఖ’ అని పిలుస్తారు. ఉత్తర దక్షిణాన్ని కలిపే ఈ రేఖకు ఓ చివర కేదార్ నాథ్ ఉండగా మరో చివర రామేశ్వరం ఉంటుంది. అవే.. కేదార్‌నాథ్, కాళేశ్వరం, శ్రీ కాళహస్తి, కాంచీపురం, అరుణాచలం, చిదంబరం , రామేశ్వరం
కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath)
ఉత్తరాఖాండ్ రుద్ర ప్రయాగ్ జిల్లా కేదార్‌నాథ్ లో ఉంది ఈ ఆలయం. దీనిని అర్థ జ్యోతిర్లింగం అంటారు. జనమేజయుడు నిర్మించి ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్యలు పునర్ నిర్మించారని చెబుతారు. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయం. మిగిలిన ఆరు నెలలు మూసి ఉంటుంది. ఇది 79.0669 డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది.
కాళేశ్వరం (Kaleshwaram)
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరంలో ఉంది కాళేశ్వరం. త్రిలింగదేశంగా శంకరుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం 79.9067° డిగ్రీల రేఖాంశంలో ఉంది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం (Kalahasti)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది పంచభూత క్షేత్రం. తిరుమలను దర్శించుకునే భక్తులు శ్రీ కాళహస్తి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం 79.7037 డిగ్రీల రేఖాంశంలో ఉంది.
కాంచీపురం (Ekambareshwaram)
పంచభూత లింగాల్లో ఒకటైన ఏకాంబరేశ్వరుడు కొలువైన ప్రదేశం ఇది. పల్లవ రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు మెరుగులు దిద్దారు. ఈ ఆలయం 79.7036 డిగ్రీల రేఖాంశంలో ఉంది.
అరుణాచలం ( Thiruvannaikaval)
శంకరుడే కొండగా వెలసిన క్షేత్రం అరుణాచలం. ఈ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ శివుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసినట్టే అని భక్తుల విశ్వాసం. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రాన్ని చోళులు నిర్మించారు. పౌర్ణమి తిథి ఇక్కడ అత్యంత ప్రత్యేకం. ఇది 79.0747 డిగ్రీల రేఖాంశంలో ఉంది
నటరాజస్వామి ఆలయం (Chidambaram)
తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయంలో శివుడిని నటరాజస్వామిగా కొలుస్తారు. ఈ ఆలయం 79.6954 డిగ్రీల రేఖాంశంలో ఉంది.
రామేశ్వరం (Rameshwaram)
రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్టించాడని, పాండవులు పునర్ నిర్మించారని పురాణాల్లో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొకటి. ఈ ఆలయం 79.3129 డిగ్రీల రేఖాంశంలో ఉంది.
2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది ఫలితాలు తెలుసుకునేందుకు Abp Desam ఆధ్యాత్మికం లింక్ క్లిక్ చేయండి.. ఇందులో మీ రాశి వార్షిక ఫలితాలు చూసుకోవచ్చు
మరిన్ని చూడండి