ByGanesh
Fri 29th Nov 2024 08:09 PM
తాను నటించిన సినిమాలోని సీన్స్, పాటలు వాడుకోనివ్వలేదు అంటూ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన హీరో ధనుష్ పై నయనతార మాములుగా ఫైర్ అవ్వలేదు, ధనుష్ ఇజ్జత్ తీసేలా ఆమె సోషల్ మీడియా వేదికగా ధనుష్ పై ఫైర్ అయ్యింది. డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీనే లోని 3 సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు గాను ధనుష్ 10 కోట్ల జరిమానా కట్టాలని నయనతారకు నోటీసులు పంపాడు.
దానితో కడుపు మండిన నయనతార సోషల్ మీడియాలో ధనుష్ పరువు తీసేసింది, కానీ ధనుష్ ఊరుకోలేదు. నయనతార ఆ క్లిప్ వాడుకున్నందుకు కోర్టు కెళ్లాడు. దానితో నయనతార మరింతగా రగిలిపోయింది అనేలా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కర్మను నమ్ము, కర్మ ప్రకారం.. నువ్ ఒకరి జీవితాన్ని అబద్దాలతో నాశనం చేయాలని చూస్తే దానిని వారు అప్పుగా తీసుకుని మళ్ళీ నీకు దానిని వడ్డీతో సహా తిరిగి ఇస్తారు అంటూ నయనతార వేసిన ట్వీట్ ధనుష్ ని ఉద్దేశించే అంటూ ధనుష్ అభిమానులు మరోసారి నయన్ పై ఫైర్ అవుతున్నారు.
Should Nayan be angry with Dhanush:
Nayanthara sensational tweet about Dhanush